సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. పోలీసుల నోటీసులు జారీ చేయడంతో అల్లు అర్జున్ మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే.