ఆ 85% మంది అతిగా పని చేస్తున్నట్లు భావిస్తున్నారు: సత్య నాదెళ్ల

కొవిడ్‌ అనంతరం పని ప్రదేశాల్లో విధివిధానాలు మారాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో కొన్ని సవాళ్లను సంస్థలు ఎదుర్కొన్నాయి. తమ సంస్థకు ఉత్పాదక సమస్యలొస్తున్నాయని స్వయంగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తాజాగా కామెంట్‌ చేశారు. 85 శాతం మంది ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదని మేనేజర్లు భావిస్తున్నారని అదే సమయంలో 85శాతం మంది ఉద్యోగులు

ఆ 85% మంది అతిగా పని చేస్తున్నట్లు భావిస్తున్నారు: సత్య నాదెళ్ల

|

Updated on: Sep 23, 2024 | 9:41 PM

కొవిడ్‌ అనంతరం పని ప్రదేశాల్లో విధివిధానాలు మారాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో కొన్ని సవాళ్లను సంస్థలు ఎదుర్కొన్నాయి. తమ సంస్థకు ఉత్పాదక సమస్యలొస్తున్నాయని స్వయంగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తాజాగా కామెంట్‌ చేశారు. 85 శాతం మంది ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదని మేనేజర్లు భావిస్తున్నారని అదే సమయంలో 85శాతం మంది ఉద్యోగులు తాము ఎక్కువగా కష్టపడినట్లు చెబుతున్నారనీ అలాంటి డేటా తమ వద్దకు వచ్చిందనీ సత్య నాదెళ్ల తెలిపారు. దీంతో ఒకే విషయాన్ని రెండు కోణాల్లో ఎలా చూడాలనే విషయంపై చర్చిస్తున్నట్లు చెప్పారు. వచ్చిన డేటాను ఉపయోగించి ఈ సమస్యపై దృష్టి సారిస్తామని నాదెళ్ల అన్నారు. ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌.. ఉత్పాదకత సమస్యలతో ఇబ్బందిపడుతోందని అమెరికాలో సీఈఓ సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. లింక్డిన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హాఫ్మన్‌ తో ముచ్చటించిన సత్య నాదెళ్ల .. మేనేజర్లు, ఉద్యోగులు సంస్థకు అందించిన నివేదికపై మాట్లాడారు. కొవిడ్‌ తర్వాత పని ప్రదేశాల్లో ఉన్న విధివిధానాలతో పాటు రిమోట్‌ వర్క్‌ సవాళ్లతో ఉత్పాదక సమస్యలొస్తున్నాయని సత్య నాదెళ్ల అన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిమ్ కార్డు కొనుగోలుకు రూల్స్‌ మారాయి.. టెలికాం శాఖ సరికొత్త నిబంధనలు

దేశం నిండా బంగారమే.. ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు

నీలి రంగులో గోదారి.. ఎర్రగా ప్రాణహిత.. ఇంతకీ ఏం జరుగుతోంది ??

మెటా ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌.. పేరెంట్స్‌ కంట్రోలింగ్‌లోనే టీనేజర్ల ఖాతాలు

ఓర్నీ… అదుర్స్‌ సినిమా చూపించి ఆపరేషన్‌ చేసేసారు… రోగి మాత్రం..

Follow us