Tomato Price: బంగారంతో పోటీపడుతున్న టమాటా.. బాబోయ్.. ఏంటి ఆ ప్రైజ్
మదనపల్లిలో టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. కిలో ₹10 నుండి ₹63కి పెరిగింది. మొంథా తుఫాను, ఎడతెరిపిలేని వర్షాలు, దిగుబడి తగ్గడం, చీడపీడల బెడద ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. కర్ణాటక నుండి సరఫరా తగ్గడంతో డిమాండ్ పెరిగి, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌లో టమాటా కొరత స్పష్టంగా కనిపిస్తోంది.
టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. కిలో టమాటా ధర రూ.63కి చేరడంతో కొనుగోలుదారులు నోరెళ్లబెడుతున్నారు. పది రోజుల క్రితం వరకు కేవలం పది రూపాయలకు కిలో పలికిన టమాటా ధరలు. ఒకేసారి 63 రూపాయల వరకు ధర పలకడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం టమాటా ధరలేనా.. మిగిలిన కూరగాయల ధరలు కూడా ఉరిమి చూస్తాయా అనుకుంటూ వాపోతున్నారు. టమాటా బంగారంతో పోటీపడుతోందా అన్నట్టుగా ధరలు పెరుగుతున్నాయి. మదనపల్లి మార్కెట్ లో కిలో రూ.63 టమాటా ధర తలుకుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో ప్రధాన ఆదాయ పంటగా టమాటా సాగు చేస్తున్న రైతులు ధర ఉన్నా దిగుబడి లేక దిగులు చెందుతున్నారు. ఉమ్మడి మదనపల్లి, తంబళ్లపల్లి పుంగనూరు పలమనేరు నియోజకవర్గాల్లోనే దాదాపు 10 వేల హెక్టార్లలో టమాటా సాగు చేసిన రైతులు దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంటుందని భావించారు. సీజన్ ముగుస్తున్న సమయంలో మొంథా తుఫాను, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. వర్షాల వల్ల చీడ పీడల బెడద రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో దిగుబడి కూడా భారీగా తగ్గిపోయింది. దీంతో మదనపల్లి మార్కెట్‌కు దిగుబడి తగ్గింది. వర్షాల కారణంగా తేమశాతం అధికం కావడం, టమాటా మచ్చలు ఏర్పడడంతో పాటు పొలాల్లోనే కుళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే సమయంలో రోజు సగటున దాదాపు 700 మెట్రిక్ టన్నుల టమాటా మదనపల్లి మార్కెట్ కు రాగా ప్రస్తుతం 150 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. మదనపల్లి సరిహద్దున ఉండే కర్ణాటక ప్రాంతంలోని కోలారు, చింతామణి, ముల్బాగల్ ప్రాంతాల నుంచి కూడా ఆశించిన మేర మదనపల్లి మార్కెట్ కు టమాటా దిగుబడి కాకపోవడంతో ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. డిమాండుకు తగ్గట్టుగా మదనపల్లి మార్కెట్ లో టమాటా అందుబాటులో లేకపోవడం, మరోవైపు టమాటా కొనుగోలుకు బయట నుంచి ట్రేడర్లు కూడా ఆసక్తి చూపుతున్నడంతో మదనపల్లి మార్కెట్లో టమాటాకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల క్రితం రూ.10 పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు ఏకంగా రూ. 60 కు పైగానే ఉంటోంది. మొంథా తోపాటు వరుస తుఫానుల ప్రభావంటో కురుస్తున్న వర్షాలు కారణంగా టమాటా ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. దుకాణం ముందు పిండిబొమ్మ, కోడిగుడ్లు.. వణికిపోతున్న బస్తీ వాసులు
చికెన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. రూపాయికే అరకేజీ చికెన్.. కండిషన్స్ అప్లై
ఆస్పత్రిలో డాక్టర్ డ్యాన్స్.. దెబ్బకు ఉద్యోగం ఊస్ట్
అక్కడి ట్రాఫిక్‌ను దాటడం కంటే.. అంతరిక్షానికి వెళ్లడం ఈజీ
ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్లాంచీలో సాగర్ – శ్రీశైలం లాహిరి లాహిరి
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

