ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్ లాంచీలో సాగర్ – శ్రీశైలం లాహిరి లాహిరి
నల్లమల అటవీ అందాలు, కృష్ణానది పరవళ్ల మధ్య నాగార్జునసాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం నవంబర్ 22న తిరిగి ప్రారంభం కానుంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ 6 గంటల యాత్ర పర్యాటకులకు మంత్రముగ్ధులను చేసే అనుభూతినిస్తుంది. టికెట్ ధరలు, ప్యాకేజీ వివరాలు, ఆన్‌లైన్ బుకింగ్ సహా పూర్తి సమాచారం కోసం `tgtdc.in` సందర్శించండి.
కృష్ణానదిలో లాహిరి లాహిరి లాహిరిలో.. అని పాడుకుంటూ దట్టమైన నల్లమల అటవీ అందాలను ఆస్వాదిస్తూ లాంచీ ప్రయాణం చేయాలనుకునే ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ అందాల మధ్య సాగే నార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీనీ ఈనెల 22నుంచి ప్రారంభించేందుకు టీజీటిడీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
దట్టమైన నల్లమల అటవీ అందాలు, కృష్ణానది పరవళ్ల మధ్య నాగార్జునసాగర్ టు శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు మంత్రముగ్ధులను చేసే అనుభూతినిస్తుంది. నవంబర్ 22 నుండి తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లాంచీ ప్రయాణం తిరిగి ప్రారంభం కానుంది. పర్యాటకులు, ప్రయాణికులు, భక్తుల కోసం టూర్ ప్యాకేజీలను పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి రానుపోను పెద్దలకు రూ.3250, పిల్లలకు రూ.2,600 టికెట్ ధరలను నిర్ణయించింది. అలాగే నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు మాత్రమే వచ్చే పెద్దలకు రూ.2,000లు, పిల్లలకు రూ.1,600 వసూలు చేయనున్నారు. లాంచీలో ప్రయాణికులు నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ అందాలను వీక్షించేలా లాంచీ ప్రయాణం ఉంటుంది. నదిలో సుమారు 110 కిలోమీటర్ల దూరం.. ఏకధాటిగా ఆరు గంటల లాంచీ జర్నీ ఉంటుంది. ప్రయాణంలో మధ్యాహ్నం భోజన సౌకర్యం లాంచీలోనే ఏర్పాటు చేశామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 10:30 గంటలకు నాగార్జున సాగర్ నుండి లాంచీ బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు పాతాళగంగకు చేరుకుంటుంది. మరుసటి రోజు పర్యాటకులు, భక్తులు మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత లాంచీ నాగార్జునసాగర్‌కు తిరిగి బయలుదేరి వెళ్తుంది. అయితే శ్రీశైలంలో రూమ్, ట్రాన్స్ పోర్ట్ వంటి వాటికి ఎవరికి వారే భరించాల్సి ఉంటుందని పర్యాటక శాఖ తెలిపింది. ఈనెల 22 నుండి ప్రతి శనివారము టికెట్ల బుకింగ్ ఆధారంగా సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని కొనసాగిస్తామని సంస్థ తెలిపింది. సోమవారం నుండి శుక్రవారం వరకు 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఆన్ లైన్ టికెట్ల కోసం www.tgtdc.in వెబ్ సైట్ లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్ :9848540371, 9848125720, అలాగే నాగార్జునసాగర్ లాంచీ యూనిట్ 7997951023 ఫోను నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాత్రి ఘనంగా పెళ్లి… తెల్లారేసరికి కనిపించకుండా పోయిన పెళ్లికూతురు
ఆలయ వసతి గృహానికి అనుకోని అతిథి.. ఆ తర్వాత
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్ డబ్బులు రెడీ
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

