ఆలయ వసతి గృహానికి అనుకోని అతిథి.. ఆ తర్వాత
వేములవాడ రాజన్న ఆలయ వసతి గృహంలో నాగుపాము ప్రత్యక్షమై భక్తులకు భయాందోళన కలిగించింది. దర్శనం కోసం సిద్ధమవుతున్న భక్తుల గదిలోకి పాము రావడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ చాకచక్యంగా పామును పట్టుకుని సురక్షితంగా బయటకు చేర్చారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచి, భద్రత కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
కొందరు భక్తులు దైవదర్శానానికి వెళ్లి అక్కడి ఆలయ వసతి గృహంలో బస చేసారు. గుడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నవారు ఎవరి హడావిడిలో వారున్నారు. ఇంతలో అక్కడ ఓ అనుకోని అతిథి ప్రత్యక్షమైంది. దీంతో.. ఒక్కసారిగా భక్తులు పరుగులు తీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ వసతి గృహంలోని రూమ్ నెంబర్ 13ఏ పార్వతిపురంలో నాగు పాము ప్రత్యక్షమైంది. కొంత మంది భక్తులు అదే రూంలో బస చేశారు. అందరూ దర్శనాల కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో.. పాము పడగ విప్పి బసలు కొడతూ అటు.. ఇటు తిగుతూ భయభ్రాంతులకు గురి చేసింది. ఇంతలో కొందరు భక్తులు ఆలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న అటెండర్.. స్నేక్ క్యాచర్ జగదీష్ కు సమాచారం అందించాడు. వెంటనే.. అక్కడికి చేరకున్న జగదీష్ ఎవరికీ ఎలాంటి హానీ కలగకుండా ఎంతో చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నాడు. దీంతో భక్తులతో పాటు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. పాములు రాకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. అయితే ఆలయంలోకి ప్రవేశించిన ఈ పాము ఎలా వచ్చిందో తెలియ లేదు. వసతి గృహంలోకి పాము రావడంతో భక్తులు భయపడుతున్నారు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు పాము రావడం ఇదే మొదటిసారని వసతి గృహ సిబ్బంది అంటున్నారు. ఈ ప్రాంతంలో పాములు లేవని, భక్తులు భయపడవద్దని స్థానిక సిబ్బంది చెబుతున్నారు.వేములవాడ రాజన్న ఆలయ వసతి గృహంలో నాగుపాము ప్రత్యక్షమై భక్తులకు భయాందోళన కలిగించింది. దర్శనం కోసం సిద్ధమవుతున్న భక్తుల గదిలోకి పాము రావడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ చాకచక్యంగా పామును పట్టుకుని సురక్షితంగా బయటకు చేర్చారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచి, భద్రత కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్ డబ్బులు రెడీ
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

