AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్ డబ్బులు రెడీ

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్ డబ్బులు రెడీ

Phani CH
|

Updated on: Nov 25, 2025 | 4:40 PM

Share

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ₹161 కోట్ల పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని 2,813 కాలేజీల విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థలో మార్పుల కోసం కమిటీ నివేదిక కూడా సిద్ధమవుతోంది.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు పెద్ద శుభవార్తను అందించింది. పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖకు అధికారిక ఆదేశాలు ఇచ్చారు. మొత్తం రూ.161 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు త్వరలోనే విడుదల కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖతో పాటు విద్యా శాఖ, సోషల్ వెల్ఫేర్ వంటి సంబంధిత విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 2,813 జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన స్కాలర్‌షిప్ నిధులు నిలిచిపోయి ఉన్నట్లు ఈ సమావేశంలో అధికారుల నివేదికలో తేలింది. దీనితో వెంటనే చర్యలు తీసుకుంటూ పెండింగ్‌లో ఉన్న రూ.161 కోట్ల మొత్తాన్ని విడుదల చేయాలని డిప్యూటీ సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా స్కాలర్‌షిప్ బకాయిల సమస్య రాష్ట్ర విద్య రంగంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.కాగా, ప్రభుత్వం చొరవతో ఈ అంశం ఒక కొలిక్కి వచ్చినట్లయింది. విద్యార్థులు లేదా కాలేజీలపై ఆర్థిక భారం పడకుండా వ్యవస్థను స్థిరపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పడిన ఆర్థిక గందరగోళాన్ని దశలవారీగా సరిదిద్దుతున్నమని తెలిపిన భట్టి… ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థలో మార్పుల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ పని కూడా కొనసాగుతోందన్నారు. విద్యా నిపుణులు, కాలేజీ ప్రతినిధులతో కలిసి కొత్త సంస్కరణల దిశగా ఒక సమగ్ర నివేదిక సిద్ధం చేసే పనిలో కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kokapet: కోకాపేటలో రికార్డు ధర పలికిన ప్లాట్లు

ప్రమాదాలమయంగా హైదరాబాద్ – విజయవాడ హైవే

Chandrababu Naidu: అరటి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన AP CM

గుడ్‌ న్యూస్‌.. బంగారం, వెండి ధరలు తగ్గాయి

ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ