AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి ఘనంగా పెళ్లి... తెల్లారేసరికి కనిపించకుండా పోయిన పెళ్లికూతురు

రాత్రి ఘనంగా పెళ్లి… తెల్లారేసరికి కనిపించకుండా పోయిన పెళ్లికూతురు

Phani CH
|

Updated on: Nov 25, 2025 | 4:49 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో పెళ్లి తర్వాత వధువు పల్లవి మాయమవడం సంచలనం సృష్టించింది. పెళ్లి తంతు ముగిసిన కొన్ని గంటల్లోనే వధువు అదృశ్యమైంది. ప్రియుడితో పారిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుడి కుటుంబం ఫిర్యాదు చేయగా, పోలీసులు సీసీటీవీ, మొబైల్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పెళ్లి ఇంట్లో గందరగోళానికి దారితీసింది.

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో అనూహ్య ఘటన జరిగింది. రాత్రి బంధుమిత్రుల సమక్షంగా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న వధువు తెల్లారేసరికి వరుడికి ఊహించని షాకిచ్చింది. పెళ్లి వేడుకలో అన్ని ఆచారాలు పూర్తి చేసుకుని, పెళ్లితంతు ముగిసిన కొన్ని గంటల తర్వాత పెళ్లికూతురు అదృశ్యమైంది. దీంతో వరుడి కుటుంబం ఇప్పుడు వధువు కుటుంబంపై ఫిర్యాదు చేసింది. మూడు నెలల క్రితం పల్లవి, సునీల్ కుమార్ గౌతమ్ ల వివాహం నిశ్చయమైంది. నవంబర్ 18 మంగళవారం రాత్రి, వరుడి ఊరేగింపు దాదాపు 90 మంది అతిథులతో బారాబంకి చేరుకుంది. ఆచారాలు ముగిసిన తర్వాత ఈ జంట దండలు మార్చుకున్నారు. వివాహం అర్థరాత్రి ఘనంగా జరిగింది. జయమాల వేడుక తర్వాత వధూవరులు వేదికపై కలిసి డాన్స్ కూడా చేశారు. బుధవారం ఉదయం, విదాయి వేడుకకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో వధువు పల్లవి కనిపించకుండాపోయింది. మొదట, ఆమె ఏ వాష్‌రూమ్‌లోనో ఉండి ఉంటుందిలే అనుకున్నారు. కానీ గంటలు సమయం గడుస్తున్నా వధువు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. ఇరు కుటుంబాలవారూ చుట్టుపక్కల అంతా వెతికారు.. వధువు జాడలేదు. మధ్యాహ్నం దాటినా, ఆమె జాడ తెలియకపోవడంతో, అందరూ భయాందోళనలకు గురయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం, వధువు తన ప్రేమికుడితో పారిపోయి ఉండవచ్చని తేలింది. దీంతో ఇంట్లో గందరగోళం నెలకొంది. వివాహ ఆచారాలన్నీ పూర్తయిన తర్వాత ఆమె రాత్రి వెళ్లిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, వరుడి కుటుంబం వధువు కుటుంబంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. యువతి కదలికలను తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ లొకేషన్లు, సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయ వసతి గృహానికి అనుకోని అతిథి.. ఆ తర్వాత

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్ డబ్బులు రెడీ