అక్కడి ట్రాఫిక్‌ను దాటడం కంటే.. అంతరిక్షానికి వెళ్లడం ఈజీ
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా బెంగళూరు ట్రాఫిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు టెక్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, అంతరిక్ష యానం కంటే నగరం ట్రాఫిక్‌ను దాటడం చాలా కష్టమని అన్నారు. ఈ వ్యాఖ్యలు నగర తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను మరోసారి ఎత్తిచూపాయి. మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ, భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
బెంగళూరులో ట్రాఫిక్‌పై భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ట్రాఫిక్‌ను దాటుకొని వెళ్లడం కంటే అంతరిక్ష యానం చాలా ఈజీ అని వ్యాఖ్యానించారు. నవంబరు 20 గురువారం జరిగిన బెంగళూరు టెక్ సమ్మిట్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. అంతేకాకుండా నగరం ఎదుర్కొంటున్న తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను మరోసారి ఎత్తిచూపాయి. సదస్సులో ప్రసంగించిన శుక్లా.. తాను నగరం అవతలి వైపున్న మారతహళ్లి నుంచి ఇక్కడికి వస్తున్నానని, ఈ సభలో ప్రసంగించే సమయం కన్నా ఇంటినుంచి ఇక్కడికి చేరుకోడానికి పట్టిన సమయం మూడు రెట్లు ఎక్కువ అని తెలిపారు. సభలో కంటే ప్రయాణంలోనే ఎక్కువ సమయం ఉన్నానని.. నా నిబద్ధతను మీరు అర్థం చేసుకోవాలని నవ్వుతూ అన్నారు. ఈ ఏడాది జూలైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. 41 ఏళ్ల అనంతరం భారత తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన నిలిచారు. శుక్లా వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. అంతరిక్షం నుంచి బెంగళూరుకు రావడం సులువే కానీ, మారతహళ్లి నుంచి వేదిక వద్దకు రావడం కష్టమైందని శుక్లా అన్నారని, భవిష్యత్తులో ఇలాంటి జాప్యాలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో శుక్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే సగటు ప్రయాణ సమయం 54 నిమిషాల నుంచి 63 నిమిషాలకు పెరిగింది. 2025 మొదటి ఆరు నెలల్లోనే నగరంలో మూడు లక్షలకు పైగా కొత్త ప్రైవేట్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం ప్రతిపాదించిన టన్నెల్ రోడ్ ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న తరుణంలో శుక్లా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్లాంచీలో సాగర్ – శ్రీశైలం లాహిరి లాహిరి
రాత్రి ఘనంగా పెళ్లి… తెల్లారేసరికి కనిపించకుండా పోయిన పెళ్లికూతురు
ఆలయ వసతి గృహానికి అనుకోని అతిథి.. ఆ తర్వాత
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్ డబ్బులు రెడీ
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

