ఆస్పత్రిలో డాక్టర్ డ్యాన్స్.. దెబ్బకు ఉద్యోగం ఊస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని షామలీ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ వకార్ సిద్ధిఖీ తన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ విభాగంలో పనిచేస్తూ, ఆసుపత్రి గదిలో కాబోయే భార్యతో డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ సంఘటన వృత్తిపరమైన బాధ్యతారాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చింది.
డాక్టర్లు అంటే విధుల్లో ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఓ వైద్యుడు అందుకు భిన్నంగా వ్యవహరించాడు. పైగా అతను ఎమర్జెన్సీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎమర్జెన్సీ విభాగం అంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ వైద్యుడు బాధ్యతారహితంగా వ్యవహరించాడు. తన కాబోయే భార్యతో కలిసి ఆస్పత్రిలో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. దీంతో అతని ఉద్యోగానికే ఎసరొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ వకార్ సిద్ధిఖీ, షామ్లీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రెండేళ్ల కాంట్రాక్టు ప్రాదిపదికన ఉద్యోగంలో చేరాడు. ఎమర్జెన్సీ విభాగంలో అతనికి బాధ్యతలు అప్పగించారు. అతను ఉండటానికి ఆస్పత్రిపైనే ఒక గది ఇచ్చారు. అయితే ఆ డాక్టర్ ఇటీవల తనకు కాబోయే భార్యను గదికి తీసుకొచ్చి డ్యాన్స్ చేశాడు. ఆ గదిలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. దాంతో డాక్టర్ తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై వివరణ ఇవ్వాలని డాక్టర్‌కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అతడు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. అతడికి ఇచ్చిన గదిని ఖాళీ చేయించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడి ట్రాఫిక్‌ను దాటడం కంటే.. అంతరిక్షానికి వెళ్లడం ఈజీ
ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్లాంచీలో సాగర్ – శ్రీశైలం లాహిరి లాహిరి
రాత్రి ఘనంగా పెళ్లి… తెల్లారేసరికి కనిపించకుండా పోయిన పెళ్లికూతురు
ఆలయ వసతి గృహానికి అనుకోని అతిథి.. ఆ తర్వాత
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్ డబ్బులు రెడీ
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

