వామ్మో.. దుకాణం ముందు పిండిబొమ్మ, కోడిగుడ్లు.. వణికిపోతున్న బస్తీ వాసులు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అమావాస్య వేళ క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఒక దుకాణం ముందు పిండి బొమ్మ, పసుపు, కుంకుమ పిండి ముద్దలతో భయానక దృశ్యాన్ని చూసి యజమాని, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాత్రిపూట పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
అమావాస్య వేళ క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఉదయాన్నే దుకాణం తెరవడానికి వచ్చిన యజమాని తన షాపు ముందు ఉన్న భయానక దృశ్యాన్ని చూసి హడలిపోయాడు. లబోదిబోమంటుంటే స్ధానికులు పరుగెత్తుకొచ్చారు. దుకాణం ముందు సీన్ చూసి వణికిపోయారు. ఓర్నాయనో ఇళ్ల మధ్య ఈ దుశ్చర్యలేంటి దేవుడో అంటూ గోలగోల చేశారు. ఈ ఘటన మంచిర్యాలలో జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రడగంబాల బస్తీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ దుకాణం ముందు పిండి బొమ్మకు సూది గుచ్చి, పసుపు, కుంకుమలు కలిపి చేసిన పిండి ముద్దలు, కోడిగుడ్లు పెట్టి పూజలు చేశారు. శుక్రవారం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమానికి షాపు ముందు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు చూసి హడలెత్తిపోయాడు. విషయం తెలిసిన బస్తీ వాసులు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. స్థానికులు అటువైపు వెళ్లాలంటేనే వణికి పోయారు. గురువారం అమావాస్య కావడం.. తన షాపు ముందు ఇలా భయంకరంగా క్షుద్రపూజలు చేయడంతో దుకాణ యజమాని నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా బస్తీలో ఇలాగే ముగ్గులు వేసి భయబ్రాంతులకు గురి చేశారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించి క్షుద్ర పూజలు చేసే వారిని పట్టుకోవాలని కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చికెన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. రూపాయికే అరకేజీ చికెన్.. కండిషన్స్ అప్లై
ఆస్పత్రిలో డాక్టర్ డ్యాన్స్.. దెబ్బకు ఉద్యోగం ఊస్ట్
అక్కడి ట్రాఫిక్‌ను దాటడం కంటే.. అంతరిక్షానికి వెళ్లడం ఈజీ
ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్లాంచీలో సాగర్ – శ్రీశైలం లాహిరి లాహిరి
రాత్రి ఘనంగా పెళ్లి… తెల్లారేసరికి కనిపించకుండా పోయిన పెళ్లికూతురు
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

