LPG Price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. వాణిజ్య సిలిండర్ ధరను మరోసారి భారీగా తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై 51 రూపాయల 50 పైసలు తగ్గించాయి. ఈ ధరలు సెప్టెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు ప్రకటించాయి.
తాజా తగ్గింపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర 1,580 రూపాయలకు చేరగా, కోల్‌కతాలో రూ.1683, ముంబైలో రూ.1531, చెన్నైలో 1737 రూపాయలకు చేరింది. సిలిండర్ ధర తగ్గడంతో చిరు వ్యాపారులకే కాకుండా.. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఊరట లభించింది. గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. జూన్‌లో రూ.24, జులై 1న రూ. 58.50, ఆగస్టులో రూ. 33.50 చొప్పున ధరలను తగ్గించాయి చమురు సంస్థలు. కాగా, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, ఇతర మార్కెట్ అంశాల ఆధారంగా ప్రతి నెలా ఈ ధరలను సవరిస్తుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఖాతాదారుల బంగారాన్ని స్వాహా చేసిన బ్యాంక్ మేనేజర్,క్యాషియర్
బయటి నుంచి వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకున్న వ్యక్తి.. కాసేపటికే నురగలు కక్కుతూ
Earthquake: భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

