Earthquake: భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
అప్ఘానిస్థాన్‌ను మరో భారీ భూకంపం వణికించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల 47 నిమిషాలకు మొదటి భూకంపం సంభవించగా దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. భూకంపం తీవ్రతకు 20 నిమిషాల వ్యవధిలోనే అదే ప్రాంతంలో 4.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఈ విపత్తు కారణంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఆదేశ సమాచార మంత్రిత్వశాఖ స్థానిక వార్తా సంస్థకు వెల్లడించింది. కునార్ ప్రావిన్స్‌లోని జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ పేర్కొంది. భూకంప కేంద్రం బసావుల్ పట్టణానికి 36 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్నట్టు గుర్తించారు. లోతు తక్కువగా ఉండటంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించారు. కునార్ ప్రావిన్స్‌లోని నూర్ గల్, సావ్కి, వాత్‌పుర్, మనోగీ, చపా దారా జిల్లాల్లో అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారని, బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని తెలిపారు. అసమర్థ తాలిబన్ ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా లేదని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ ఆరోపించారు. ఈ సమయంలో కునార్ ప్రజలకు అత్యవసర సాయం అవసరమని, అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు. అవసరమైన ఆహారం అందించి, ఆశ్రయం కల్పించాలని పోస్ట్ పెట్టారు. అక్టోబర్ 7, 2023న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ విపత్తులో కనీసం 4,000 మంది చనిపోయారని తాలిబన్ ప్రభుత్వం అంచనా వేయగా, ఐక్యరాజ్యసమితి మాత్రం మృతుల సంఖ్య సుమారు 1,500 అని పేర్కొంది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా అది నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ల్యాబ్‌లో తయారైన మానవ కిడ్నీ..ఆశ్చర్యంగా పని చేస్తోంది
త్వరలో ఆధార్ యాప్ ఇక.. ఆధార్ సెంటర్లకు బై బై
టెర్రస్ పై నుంచి దూకబోయిన ‘నీట్’ విద్యార్థిని.. చివరి నిమిషంలో
Rainfall Warning: మరో అల్పపీడనం.. వచ్చే 3 రోజులు వానలే వానలు
గుళ్లలో హుండీలను 10 సార్లు చోరీ చేసిన హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తి .. దేవుడిపై కోపంతోనే !
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

