Rainfall Warning: మరో అల్పపీడనం.. వచ్చే 3 రోజులు వానలే వానలు
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షసూచన చేసింది వాతావరణ శాఖ . వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా 1.5-1.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 2న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ఫలితంగా బలమైన తూర్పు గాలులు వీచే అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాలుగు రోజుల వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరా అంతరాయం, వరదల ప్రమాదాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇటు తెలంగాణలోనూ మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుళ్లలో హుండీలను 10 సార్లు చోరీ చేసిన హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తి .. దేవుడిపై కోపంతోనే !
అదే జరిగితే.. అమెరికా కొంప మునిగినట్లే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

