Lok Sabha Polls: బీజేపీ మూడో జాబితా విడుదల.. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ ఎక్కడనుంచంటే.?

Lok Sabha Polls: బీజేపీ మూడో జాబితా విడుదల.. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ ఎక్కడనుంచంటే.?

Ravi Kiran

|

Updated on: Mar 21, 2024 | 6:55 PM

లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ మూడు జాబితాను విడుదల చేసింది. తమిళనాడులోని 9 లోక్‌సభ స్థానాలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై చెన్నై సౌత్‌ నుంచి పోటీ చేస్తారు.

లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ మూడు జాబితాను విడుదల చేసింది. తమిళనాడులోని 9 లోక్‌సభ స్థానాలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్.. రెండు రోజుల క్రితం తమిళనాడు బీజేపీలో మళ్లీ చేరారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన మూడో జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై చెన్నై సౌత్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. కోయంబత్తూరు నుంచి తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై బరిలో ఉంటారు. కన్యాకుమార్‌ పొన్‌రాధాకృష్ణన్‌ పోటీ చేస్తారు. నీలగిరి నుంచి కేంద్రమంత్రి మురుగన్‌ పోటీ చేస్తారు. వెల్లూరు నుంచి అర్ముగం పోటీ చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Published on: Mar 21, 2024 06:45 PM