నా బిడ్డతో.. అదే చివరి కాల్.. అనూష తండ్రి రోదన వీడియో

కర్నూలు బస్సు అగ్నిప్రమాదంలో తన కుమార్తె అనూషను కోల్పోయిన తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి తన బిడ్డతో మాట్లాడిన చివరి సంభాషణను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. బస్సు బయలుదేరలేదని అనూష చెప్పిందని, ఆ తర్వాతే అగ్నిప్రమాదం వార్తలు టీవీలో చూశానని తండ్రి వివరించారు.

కర్నూలు బస్సు అగ్నిప్రమాద విషాదంలో తన కుమార్తె అనూషను కోల్పోయిన తండ్రి తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి తన బిడ్డతో ఫోన్‌లో చివరిసారిగా మాట్లాడిన క్షణాలను ఆయన పంచుకున్నారు. ఉదయం వార్తల్లో బెంగళూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై 40 మంది మరణించారని తెలియడంతో గుండె పగిలిందన్నారు. అనంతరం వార్తల్లో బస్సు నంబరు (DD 01, 9490) చూసి షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత టీవీలో మృతుల పేర్లలో శ్రుతి తర్వాత తన కుమార్తె అనూష పేరు విని మరింత కుంగిపోయారు.

మరిన్ని వీడియోల కోసం :

కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్‌ సేఫ్టీ వీడియో

ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో

ల్యాప్‌టాప్స్‌ చార్జింగ్‌ పెట్టడంతో వీడియో