నాగులచవితి రోజున అద్భుతం.. పుట్ట నుంచి వచ్చి పాలు తాగిన నాగుపాము వీడియో
శ్రీకాకుళం జిల్లా పలాసలో నాగుల చవితి పర్వదినాన అద్భుతం జరిగింది. పుట్ట వద్ద భక్తులు పూజలు చేస్తుండగా నాగుపాము బయటకు వచ్చి పాలు తాగింది. ఈ సంఘటన భక్తులను ఆశ్చర్యపరిచి, భక్తి భావంతో దండం పెట్టేలా చేసింది. ఈ దృశ్యం వైరల్‌గా మారింది.
శనివారం నాగుల చవితి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పలాసా మున్సిపాలిటీ పరిధిలోని శాసనం కాలనీలో ఒక అద్భుత సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఒక చెట్టు కింద ఉన్న పుట్ట వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో నాగేంద్రుడికి పాలు, గుడ్లు సమర్పించి పూజలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో, ఆ పుట్టలో నుంచి బుసలు కొడుతూ ఒక నాగుపాము బయటకు వచ్చింది. మొదట తలను బయటకు పెట్టి అటూ ఇటూ చూసిన పాము, అంతా నిశ్శబ్దంగా ఉండటంతో నెమ్మదిగా పూర్తిగా బయటకు వచ్చింది. పుట్ట వద్ద భక్తులు ఉంచిన పాలను తాగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు భక్తిభావంతో ఆ నాగుపాముకు దండం పెట్టి, తామంతా అదృష్టవంతులమని సంతోషపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్‌టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
