AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ ఇదే

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ ఇదే

Phani CH
|

Updated on: Nov 25, 2025 | 6:58 PM

Share

ఆంధ్రప్రదేశ్ 2025-26 పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పరీక్షల సమయం ఉదయం 9.30 నుండి 12.45 వరకు. ఫిజిక్స్, కెమిస్ట్రీలకు కలిపి ఒకే పేపర్‌గా, బయాలజీకి విడిగా పరీక్ష ఉంటుంది. పరీక్ష రుసుము చెల్లింపునకు నవంబరు 26 నుండి డిసెంబరు 15 వరకు అవకాశం ఉంది. విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 1 వరకు ఆయా తేదీల్లో కొనసాగనున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి. ఈ ఏడాది ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు కలిపి ఒక పేపర్‌గా, జీవశాస్త్రం మరో పేపర్‌గా విడివిడిగా నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 50 మార్కుల చొప్పున పరీక్షలు ఉంటాయి. అంతేకాకుండా ఈ సారి అన్ని సబ్జెక్టుల పరీక్షలకు మధ్య కొంత విరామం వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు. మార్చి 16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్ష. మార్చి 18న సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్ష, మార్చి 20న ఇంగ్లీష్‌ పరీక్ష, మార్చి 23వ తేదీన మ్యాథ్స్ పరీక్ష, మార్చి 25వ తేదీన ఫిజిక్స్, కెమిస్ట్రీ పరీక్ష జరుగుతుంది. మార్చి 28వ తేదీన బయాలజీ పరీక్ష, మార్చి 30వ తేదీన సోషల్‌ స్టడీస్‌ పరీక్ష, మార్చి 31వ తేదీన ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్ష, ఏప్రిల్‌ 1వ తేదీన ఒకేషనల్‌ కోర్సు పరీక్ష జరగనున్నది. కాగా నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు 50 రూపాయిల ఆలస్య రుసుముతో పదో తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 200 రూపాయిల ఆలస్య రుసుముతో, డిసెంబరు 4 నుంచి 10 వరకు రూ.500 రూపాయిల ఆలస్య రుసుముతో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు రూ. 125 పరీక్ష రుసుమును చెల్లించాలి. ఫెయిల్ అయిన విద్యార్థులు 3 పేపర్ల కంటే ఎక్కువ ఉంటే రూ. 125, మూడు పేపర్లలోపు ఉంటే రూ. 110 చెల్లించాల్సి ఉంటుంది. వొకేషనల్ విద్యార్థులు అదనంగా మరో రూ. 60 చెల్లించాలని విద్యాశాఖ పేర్కొంది. విద్యార్ధులు గడువులోగా పరీక్ష ఫీజును చెల్లించాలని సూచించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tomato Price: బంగారంతో పోటీపడుతున్న టమాటా.. బాబోయ్.. ఏంటి ఆ ప్రైజ్

వామ్మో.. దుకాణం ముందు పిండిబొమ్మ, కోడిగుడ్లు.. వణికిపోతున్న బస్తీ వాసులు

చికెన్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. రూపాయికే అరకేజీ చికెన్.. కండిషన్స్‌ అప్లై

ఆస్పత్రిలో డాక్టర్‌ డ్యాన్స్‌.. దెబ్బకు ఉద్యోగం ఊస్ట్‌

అక్కడి ట్రాఫిక్‌ను దాటడం కంటే.. అంతరిక్షానికి వెళ్లడం ఈజీ