AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మ హత్య

కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మ హత్య

Phani CH
|

Updated on: Nov 25, 2025 | 7:01 PM

Share

సంగారెడ్డి జిల్లా ఎల్గోయిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. న్యుమోనియాతో ఆరేళ్ల కూతురు వైష్ణవి మరణించగా, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక తల్లి లావణ్య కొద్ది గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుంది. చిన్నారి వైద్యానికి కుటుంబ కలహాలు కారణమని బంధువుల ఆరోపణలు. ఈ హృదయ విదారక ఘటన గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

అనారోగ్యంతో ఆరేళ్ల కూతురు వైష్ణవి మరణించగా, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక తల్లి లావణ్య గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో సంగారెడ్డి జిల్లా ఎల్గోయి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ బలవన్మరణం గ్రామంలోని అందరినీ కలచివేసింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి.. ముద్దులొలికే బిడ్డ చనిపోవడం జీర్ణించుకోలేక తల్లి.. గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయిని వెంకట్, లావణ్య దంపతుల ఒక్కగానొక్క కూతురు వైష్ణవి అనారోగ్యానికి గురైంది. స్వగ్రామంతో పాటు జహీరాబాద్‌లోని ఆసుపత్రుల్లో చూపించడంతో నిమోనియా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మెరుగైన వైద్యానికి హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం చేర్పించగా.. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. స్వగ్రామానికి తీసుకొచ్చి చిన్నారి వైష్ణవి అంత్యక్రియలు పూర్తి చేసినా.. కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి లావణ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉండిపోయింది. చిన్నారి వైష్ణవి అంత్యక్రియలు పూర్తయ్యాక అందరూ వెళ్లిపోయారు. అదే సమయంలో లావణ్య ఇంట్లోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడింది. కాసేపటికి కుటుంబీకులు విషయాన్ని గుర్తించారు. చిన్నారికి సకాలంలో వైద్యం చేయించకపోవడంతోనే మృతి చెందిందని ఆరోపిస్తూ లావణ్య తరఫు బంధువులు వెంకట్‌తో గొడవపడ్డారు. ఫిర్యాదు అందలేదని ఝరాసంగం పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ ఇదే

Tomato Price: బంగారంతో పోటీపడుతున్న టమాటా.. బాబోయ్.. ఏంటి ఆ ప్రైజ్

వామ్మో.. దుకాణం ముందు పిండిబొమ్మ, కోడిగుడ్లు.. వణికిపోతున్న బస్తీ వాసులు

చికెన్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. రూపాయికే అరకేజీ చికెన్.. కండిషన్స్‌ అప్లై

ఆస్పత్రిలో డాక్టర్‌ డ్యాన్స్‌.. దెబ్బకు ఉద్యోగం ఊస్ట్‌