Punjab: పంట వ్యర్థాల కాల్చివేత ఆపండి.! పంజాబ్ సర్కారుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం..
పంజాబ్ రాష్ట్రంలో పంట దిగుబడి ఇళ్లకు చేరిన తరువాత అసలు కథ మొదలవుతుంది. ఆ తరువాత తమ పొలాల్లోని పంటవ్యర్థాలను తగులబెట్టడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ పంట వ్యర్థాల కాల్చివేత పొరుగున ఉన్న దేశ రాజధాని ఢిల్లీకి శాపంగా పరిణమించింది. స్టబుల్ బర్నింగ్ కారణంగా వెలువడే పొగల ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. దాంతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
పంజాబ్ రాష్ట్రంలో పంట దిగుబడి ఇళ్లకు చేరిన తరువాత అసలు కథ మొదలవుతుంది. ఆ తరువాత తమ పొలాల్లోని పంటవ్యర్థాలను తగులబెట్టడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ పంట వ్యర్థాల కాల్చివేత పొరుగున ఉన్న దేశ రాజధాని ఢిల్లీకి శాపంగా పరిణమించింది. స్టబుల్ బర్నింగ్ కారణంగా వెలువడే పొగల ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. దాంతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కాలుష్య తీవ్రత రోజురోజుకు అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు స్పందించింది. తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని వేళలా రాజకీయాలు తగవని వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాల కాల్చివేత వెంటనే ఆగిపోవాలన్నదే తమ అభీష్టమని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొన్నది. పంట వ్యర్థాల కాల్చివేత ఆగిపోవాలని తాము కోరుకుంటున్నట్లు సుప్రీం కోర్టు వ్యాఖ్యనించింది. రైతులు ఏం చేస్తారో, ఎట్ల చేస్తారో తెలియదు, స్టబుల్ బర్నింగ్‌ను నిలిపి వేయడం వారి బాధ్యత. తప్పనిసరిగా స్టబుల్ బర్నింగ్ ఆగిపోవాలి. అందుకోసం తక్షణమే ఏదో ఒక చర్య చేపట్టాలి అని సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.