సగ్గుబియ్యంలో శరీరానికి చాలా ఉపయోగకరమైన లక్షణాలున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే వీటిని పాలు, చక్కెర పోసి పాయసంలా ఉడికించుకొని తింటే శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. ఎండలో తిరిగేవారు ఈ సగ్గుబియ్యం పాయసం తీసుకుంటే వడదెబ్బకు గురికాకుండా కాపాడుతుంది.