Australia vs India : గాయం కారణంగా మూడో టెస్ట్ కు ఉమేష్ యాదవ్ దూరం.. అతని స్థానంలో ఎవరంటే..
టీమిండియాకు గాయలబెడద వదలడంలేదు ఇప్పటికే ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ గాయాల కారణంగా ఆస్ట్రేలియపర్యటనకు దూరం అయ్యారు...

టీమిండియాకు గాయలబెడద వదలడంలేదు ఇప్పటికే ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ గాయాల కారణంగా ఆస్ట్రేలియపర్యటనకు దూరం అయ్యారు. అదేవిధంగా ఆసీస్‌తో తొలి టెస్టులో గాయపడిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. తాజాగా రెండో టెస్ట్ లో ఉమేష్ యాదవ్ కూడా గాయపడటం ఇప్పుడు ఆందోళన కలిసాగిస్తుంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తుండగా మజిల్ పట్టేయడంతో మైదానాన్ని వీడాడు ఉమేష్. అతడు మూడో టెస్ట్ ఆడటం కష్టమేనని బీసీసీ వర్గాలు అంటున్నాయి. అతని స్థానంలో నటరాజన్ కు అవకాశం కల్పించనున్నారని తెలుస్తుంది. జనవరి 7వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా ఇరుజట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది. అయితే జనవరి 15న జరిగే చివరి మ్యాచ్ కు ఉమేష్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. రెండు వారాలకు పైగా సమయం ఉండటంతో ఉమేష్ కోలుకొని ఆఖరి మ్యాచ్ కు అందుబాటులోకి రావాలనుకుంటున్నాడని బీసీసీ వర్గాలు అంటున్నాయి.
also read:
India Vs Australia 2020: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. మూడో టెస్టుకు డేవిడ్ వార్నర్ డౌటే.?