AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025, JIO: ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త!

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్ లకు భారీగా ప్రేక్షకులు వస్తున్న నేపథ్యంలో, జియో తన 4జీ, 5జీ నెట్‌వర్క్ ను బలోపేతం చేసింది. స్టేడియం లోపల, బయటా అత్యాధునిక మొబైల్ బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. జియోనెట్ వై-ఫై సేవలతో అభిమానులు వేగవంతమైన ఇంటర్నెట్ ను ఆస్వాదించొచ్చు.

IPL 2025, JIO: ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త!
Jio
SN Pasha
|

Updated on: Apr 10, 2025 | 6:27 PM

Share

క్రికెట్‌ అభిమానులంతా క్రికెట్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో జియో క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్ కు 50,000 మందికి పైగా ప్రేక్షకుల రాకను దృష్టిలో పెట్టుకుని, జియో తన 4జీ, 5జీ నెట్‌వర్క్ ను స్టేడియం లోపల, బయటా బలోపేతం చేసింది. మ్యాచ్ హైలైట్‌లు రికార్డ్ చేయడం నుంచి వీడియో కాల్స్ చేయడం వరకు స్టేడియంలో ఉన్న అభిమానులు ఇప్పుడు జియో అత్యాధునిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్‌ను పొందొచ్చు.

స్టేడియంలో జియో హై-స్పీడ్ ‘జియోనెట్’ వై-ఫై సేవలు..

జియోనెట్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, OTP తో నిర్ధారించిన తర్వాత, జియో నెట్ కు కనెక్ట్ అవుతారు. ప్రతి సెషన్ కస్టమర్ కు 480 నిమిషాల హై-స్పీడ్ వైఫైని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రధాన క్రికెట్ స్టేడియాలలో 2,000 కంటే ఎక్కువ ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేసి, జియో ఈ సీజన్‌లో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. స్టాండలోన్ 5జీ ఆర్కిటెక్చర్, నెట్‌వర్క్ స్లైసింగ్, క్యారియర్ అగ్రిగేషన్ సాంకేతికత ఆధారంగా ఈ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు, అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన 5జీ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రయత్నం network congestion ను తగ్గించడమే కాకుండా, వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్ కూ వీలు కల్పిస్తుంది.

ఐసీసీ క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా జియో ఒకే రోజులో 50 కోట్ల జీబీల డేటాను ప్రాసెస్ చేయడం ద్వారా దాని నెట్‌వర్క్ సామర్థ్యాన్ని చాటింది. అలాగే ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సమయంలోనూ భారీ జనసాంద్రత మధ్య కూడా జియో 5జీ సేవలు నిరాటంకంగా అందించింది. Ookla నివేదిక ప్రకారం, జియో 201.87 Mbps మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను సాధించి, ఇతర టెలికాం కంపెనీలను అధిగమించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ కోర్, క్లౌడ్ ఆర్కెస్ట్రేషన్, AI/ML ప్లాట్‌ఫామ్‌లు, క్లౌడ్ నేటివ్ పరిష్కారాలతో, జియో తన నెట్‌వర్క్ వ్యవస్థపై సంపూర్ణ నియంత్రణను కలిగి ఉంది. దీని వల్ల వినియోగదారులకు స్థిరమైన, విశ్వసనీయమైన, మరియు అధిక నాణ్యత కలిగిన 5జీ అనుభవాన్ని నిరంతరం అందించగలుగుతోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ