U.K. Variant Virus: మొన్నటి దాకా కరోనా… ఇప్పుడు యూకే కొత్త వైరస్… ఎన్ని దేశాలకు పాకిందో తెలుసా..?

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. కుదిపేసింది. కోట్లాది మందిని తన బారినపడేలా చేసింది. లక్షలాది మందిని బలితీసుకుంది.

U.K. Variant Virus: మొన్నటి దాకా కరోనా... ఇప్పుడు యూకే కొత్త వైరస్... ఎన్ని దేశాలకు పాకిందో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Jan 04, 2021 | 5:04 AM

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. కుదిపేసింది. కోట్లాది మందిని తన బారినపడేలా చేసింది. లక్షలాది మందిని బలితీసుకుంది. ఇప్పుడు కరోనా మహమ్మారి అంతానికి ముహూర్తం కుదిరింది. అయితే కొత్తగా మరో రకం వైరస్ పుట్టుకొచ్చింది. చూస్తుండగానే 30 దేశాలకు పాకిపోయింది. తొలి వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాల్ని మరోసారి కలవరానికి గురిచేస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండగానే.. కొత్త వైరస్‌ ప్రపంచ దేశాల్ని చుట్టేస్తోంది. దీంతో దాదాపు అన్ని దేశాలు దీని కట్టడికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి.

ఈ కొత్త వైరస్ మహమ్మారి 30 దేశాల్లో బయటపడింది. అయితే మొదట యూకేలో ఈ వైరస్ మూలాలను గుర్తించారు. అలా అది అమెరికా, భారత్, వియత్నాం, టర్కీ ఇలా పలు దేశాల్లో విస్తరిస్తోంది. కాగా అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. వైరస్ వ్యాప్తి కారణమైన యూకే ప్రయాణికులను గుర్తించడం, ఐసోలేషన్‌కు తరలించడం వంటి చర్యలను ఆయా దేశాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా వివిధ దేశాల్లో మరికొన్ని రకాల కొత్త వైరస్‌లు వ్యాప్తిస్తున్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్‌ వైరస్ వెలుగులోకి వచ్చింది.

Also Read: Corona Vaccine: కరోనా‌పై యద్ధంలో కీలక మలుపు.. వ్యాక్సిన్ల ఆమోదంపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..!