తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతాం : సీఎం కేసీఆర్

తెలంగాణ విమోచనా దినం రాజకీయం రంగు పులుముకుంది.  ఉద్యమ సమయంలో దీన్ని బలంగా ఉపయోగించుకున్న టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత దాని ప్రభావాన్ని తగ్గించినట్టుగా కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే విమోచనా దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి ఆ తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ప్రభుత్వం దగ్గర కనిపించలేదనే విమర్శలున్నాయి. అయితే అటు బీజేపీ మాత్రం తెలంగాణ విమోచనా దినంపై పట్టుదలతో ముందుకు వెళ్తోంది. మంగళవారం జరిగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే […]

తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతాం : సీఎం కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2019 | 11:19 AM

తెలంగాణ విమోచనా దినం రాజకీయం రంగు పులుముకుంది.  ఉద్యమ సమయంలో దీన్ని బలంగా ఉపయోగించుకున్న టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత దాని ప్రభావాన్ని తగ్గించినట్టుగా కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే విమోచనా దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి ఆ తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ప్రభుత్వం దగ్గర కనిపించలేదనే విమర్శలున్నాయి.

అయితే అటు బీజేపీ మాత్రం తెలంగాణ విమోచనా దినంపై పట్టుదలతో ముందుకు వెళ్తోంది. మంగళవారం జరిగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసింది. బీజేపీ అగ్రనేతలు పలువురు ఈ కార్యక్రమానికి రానున్నట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో మిత్రపక్షంగా ఉన్నందున విమోచనా దినాన్ని జరపలేకపోతుందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ విమోచనా దినంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయంపై  బీజేపీకి చురకలు అంటించారు. కొత్తగా మతం పుచ్చుకున్నోడికి నామాలు ఎక్కువ అంటూ చమత్కరించారు. ఆ రోజు( తెలంగాణ విమోచన దినం) ఏదో బ్రహ్మండం బద్దలైపోతుందన్నట్టుగా , దానికి తామే ఏదో చేస్తామన్నట్టు చెబుతున్నారని బీజేపీని విమర్శించారు. ఖచ్చితంగా విమోచనా దినాన్ని తమ పార్టీ పాటిస్తుందని, తెలంగాణ భవన్‌మీద జాతీయ జెండా ఎగురవేస్తామని దీనిలో ఎవరికీ సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబుల అకృత్యాలపై ఆనాడు జరిగిన పోరాటాలకు గుర్తుగా జరిపే రోజును తెలంగాణ విమోచన దినంగా పాటిస్తున్నారు.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!