AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి మృతదేహాన్ని రెండేళ్లుగా బెడ్‌రూమ్ వార్డ్‌రోబ్‌లో దాచిన కొడుకు.. పోలీసుల ఎంట్రీతో షాక్!

ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో చోట ఒక్కో రకంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే, జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి, అంత్యక్రియల ఖర్చులను భరించడానికి ఇష్టపడక, తన తండ్రి మృతదేహాన్ని రెండేళ్లపాటు వార్డ్‌రోబ్‌లో దాచిపెట్టాడు. చివరికి పోలీసులకు సమాచారం అందడంతో అతగాడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

తండ్రి మృతదేహాన్ని రెండేళ్లుగా బెడ్‌రూమ్ వార్డ్‌రోబ్‌లో దాచిన కొడుకు.. పోలీసుల ఎంట్రీతో షాక్!
Japanese Man Arrested
Balaraju Goud
|

Updated on: Apr 27, 2025 | 4:57 PM

Share

ఎవరైనా మరణించిన తర్వాత వారు చేసిన సేవలను స్మరించుకుంటూ అంతిమ సంస్కారాలు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేస్తుంటారు. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరేలా ఆచార, సంప్రదాయాలను బట్టి ఖననం లేదా హననం చేసి మిగతా కార్యక్రమాలు జరుపుతారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో చోట ఒక్కో రకంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే, జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి, అంత్యక్రియల ఖర్చులను భరించడానికి ఇష్టపడక, తన తండ్రి మృతదేహాన్ని రెండేళ్లపాటు వార్డ్‌రోబ్‌లో దాచిపెట్టాడు. చివరికి పోలీసులకు సమాచారం అందడంతో అతగాడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

జపాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 56 ఏళ్ల రెస్టారెంట్ యజమాని నోబుహికో సుజుకి, జనవరి 2023లో తన 86 ఏళ్ల తండ్రి మరణించాడు. అయితే తండ్రి అంత్యక్రియల ఖర్చులను భరించడానికి ఇష్టపడక సుజుకి మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టాడు. సుజుకి టోక్యోలో తన చైనీస్ రెస్టారెంట్‌ను వారం రోజులుగా తెరవలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు అధికారులు సుజుకి ఇంటికి వచ్చి తనిఖీ చేశారు. దీంతో ఒక వార్డ్‌రోబ్‌లో దాచిపెట్టిన సుజుకి తండ్రి అస్థిపంజరాన్ని గుర్తించారు.

తన ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ, సుజుకి మృతదేహాన్ని దాచి ఉన్న విషయాన్ని అంగీకరించాడు. “అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేవని, తన తండ్రి మరణానికి సంబంధించిన పరిస్థితులు అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన తండ్రి నిర్జీవంగా ఉన్నట్లు కనుగొన్నట్లు సుజుకి పేర్కొన్నాడు. సుజుకి మొదట్లో అపరాధ భావన కలిగిందని, కానీ తరువాత తన బాధకు తన తండ్రే కారణమని నమ్మి ప్రశ్చాతాపం చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు ఇప్పుడు సుజుకిని అరెస్టు చేసి, పెన్షన్ దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.

శాన్ హోల్డింగ్స్ ఇంక్. సర్వే ప్రకారం, జపాన్‌లో సగటు అంత్యక్రియల ఖర్చు 1.3 మిలియన్ యెన్లు అటే 8,900 అమెరికన్ డాలర్లుగా ఉంది. SCMP కథనం ప్రకారం, జపాన్‌లో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 2023లో, 56 ఏళ్ల నిరుద్యోగి తన 72 ఏళ్ల తల్లి అంత్యక్రియల ఖర్చులను తప్పించుకోవడానికి ఆమె మృతదేహాన్ని మూడు సంవత్సరాలు (2019–2022) ఇంట్లో దాచాడు. అంతేకాదు ఆమె పెన్షన్‌ను క్లెయిమ్ చేసుకున్నాడు. మొత్తం 2 మిలియన్ యెన్‌లు. తరువాత అతను కోర్టులో ఒప్పుకున్నాడు. ఆమె పెన్షన్ తనకు ఏకైక ఆర్థిక సహాయంగా నిలిచిందని ఒప్పుకున్నాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..