AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షా 35 వేల ఫోన్‌.. కేవలం రూ.21 వేలకే సొంతం చేసుకోండి! ఎలాగంటే..?

అమెజాన్‌లో Samsung Galaxy S24 Ultra ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్! ₹1,35,000 విలువైన ఈ ఫోన్‌ను డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కలిపి కేవలం ₹21,000కి పొందండి. ఎక్స్ఛేంజ్ విలువ పాత ఫోన్‌ స్థితిని బట్టి మారుతుంది. ఈ అద్భుతమైన ఆఫర్‌ను EMI ద్వారా కూడా పొందవచ్చు.

లక్షా 35 వేల ఫోన్‌.. కేవలం రూ.21 వేలకే సొంతం చేసుకోండి! ఎలాగంటే..?
Samsung Galaxy S24 Ultra
SN Pasha
|

Updated on: Apr 27, 2025 | 4:56 PM

Share

పలు ఈ కామర్స్‌ సంస్థలు స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ ఆఫర్స్‌ ప్రకటిస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ ఒక లక్షా 35 వేల విలువ కలిగిన ఫోన్‌ను కేవలం రూ.21 వేలకే అందించే సూపర్‌ క్రేజీ ఆఫర్‌ను తీసుకొచ్చింది. మరి ఆ ఫోన్‌ ఏంటి? ఆఫర్‌ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.. Samsung Galaxy S24 Ultra ఇదో భారీ ధర కలిగిన ఫోన్‌. ఈ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం Samsung Galaxy S24 Ultra 256GB వేరియంట్ అమెజాన్‌లో రూ.1,34,999 ధరకు అందుబాటులో ఉంది. కానీ, అమెజాన్ 32 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది, దీంతో దాని ధర రూ.92,399కి తగ్గింది.

అలాగే అమెజాన్ రూ.2,771 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. సో మరింత ధర తగ్గుతుంది. ఫైనల్‌గా అమెజాన్ రూ.71,300 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. మీరు మంచి స్థితిలో ఉన్న అర్హత కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి, అన్ని ఆఫర్స్‌ను వాడుకున్నట్లు అయితే మీకు లక్షా 35 వేల ఫోన్‌ కేవలం రూ. 21 వేలకే పొందవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్‌ బ్రాండ్, మోడల్, స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్స్‌ను ఈఎంఐలో కూడా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం కాస్ట్‌లీ ఫోన్‌ కొనాలనుకుంటున్న వారు ఓ సారి ఈ ఆఫర్‌పై ఓ లుక్కేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి