ఇది నత్తే కానీ.. రంగులు మార్చుతుంది..!
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. మనం ఇప్పటివరకూ చాలా నత్తలు చూశాం కానీ.. ఈ నత్తను చూసి ఉండం.. ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ.. కనిపించింది. ముందు చూడగానే భయమేసినా.. అసలు అదేంటనే ప్రశ్న మన మదిలో మెదులుతూనే ఉంటుంది. మొదటిసారి ఈ నత్తను చూసినవాళ్లు.. భయపడుతూ.. కాసేపు అలాగే.. చూశాక.. అరే.. ఇది భలే ఉందే.. అంటున్నారు. ఇది రంగులు ఎలా మర్చుకుంటోంది..? ఇలాంటి నత్తలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు […]
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. మనం ఇప్పటివరకూ చాలా నత్తలు చూశాం కానీ.. ఈ నత్తను చూసి ఉండం.. ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ.. కనిపించింది. ముందు చూడగానే భయమేసినా.. అసలు అదేంటనే ప్రశ్న మన మదిలో మెదులుతూనే ఉంటుంది. మొదటిసారి ఈ నత్తను చూసినవాళ్లు.. భయపడుతూ.. కాసేపు అలాగే.. చూశాక.. అరే.. ఇది భలే ఉందే.. అంటున్నారు. ఇది రంగులు ఎలా మర్చుకుంటోంది..? ఇలాంటి నత్తలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్లు.
కాగా.. ఈ నత్త ఉత్తర అమెరికా, యూరప్ అడవుల్లో కనిపిస్తాయని.. దీన్ని జాంబీ స్నైల్ అంటారని వీడియో అప్‌లోడ్ చేసిన మైక్ ఇనోయు అనే వ్యక్తి తెలిపాడు. ఇది రంగులు మార్చుతూ.. పక్షులను అట్రాక్ట్ చేస్తుందని.. దీన్ని చూసిన పక్షులు స్వాహా చేస్తాయని.. కానీ.. పొట్టలోకి వెళ్లాక అక్కడ అది గూడు కట్టుకుంటుందట. అక్కడే గుడ్లు పెట్టి.. తర్వాత పక్షి వ్యర్థాల నుంచి బయటకు వచ్చేసి.. దాని సంతానాన్ని వృద్ధి చేసుకుంటుందని పూస గుచ్చినట్టు దాని గురించి వివరించాడు మైక్ ఇనోయు.
This zombie snail. A parasitic worm Leucochloridium has taken over its motor functions and eye stalks, making them into caterpillar mimics so birds will eat them. The worm can then reproduce in the bird’s GI tract, eventually transmitting via its faeces ? https://t.co/mP8IrGh21L pic.twitter.com/C2xc83oU54
— Mike Inouye (@minouye271) August 12, 2019