Viral Video: బైక్ పై ఫోజ్ కొట్టారు బొక్కాబోర్లా పడ్డారు.. పోయోకాలం అంటే ఇదేనేమో..
వీరు చేసే స్టంట్స్ వల్ల ఇతర అమాయకులు గాయపడడం జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ షాకింగ్ వీడియోను @mrwhite321 ట్విట్టర్ ఖాతాలో ఆగస్ట్ 12న షేర్ చేశారు.

రోడ్డుపై యువత చేసే విన్యాసాలు చూస్తూనే ఉంటాం. రద్దీగా ఉండే ప్రదేశాల్లో బైక్స్‌తో విన్యాసాలు చేయడం ఈరోజుల్లో ఫ్యాషన్ గా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి మరీ. విన్యాసాలు చేస్తుంటారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా.. చర్యలు తీసుకున్నప్పటికీ వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం రావడం లేదు. ఇటీవల నెట్టింట ఇలాంటి ప్రమాదకరమైన వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో చాలా వీడియోస్ భయంకరంగా ఉంటాయి. వారు చేసే విన్యాసాలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. వీరు చేసే స్టంట్స్ వల్ల ఇతర అమాయకులు గాయపడడం జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ షాకింగ్ వీడియోను @mrwhite321 ట్విట్టర్ ఖాతాలో ఆగస్ట్ 12న షేర్ చేశారు.
అందులో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం పై అత్యంత ప్రమాదకరంగా విన్యాసాం చేస్తూ వెళ్తు్న్నారు. అయితే ఉన్నట్టుండి రైడర్ స్టంట్ చేయడానికి ప్రయత్నించడంతో వారి బైక్ స్కిడ్ అయి రోడ్డుపై పడిపోయారు. బైక్ పై నుంచి పడిన వెంటనే ఇతర వాహనాలు ఢీకొట్టకుండా ఉండేందుకు వెంటనే లేచి పక్కకు పరిగెత్తారు.ఈ క్రమంలో ఇద్దరు రోడ్డు పక్కకు పరిగెత్తుతుండా 9 సెకన్ల వ్యవధిలో అందులో ఓ యువకుడిని మరో బైక్ ఢీకొట్టడంతో అతను ఎగిరిపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.




ట్వీట్..
How unlucky ??? pic.twitter.com/YKaAWry690
— 24/7vids???️ (@mrwhite321) August 18, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
