Viral Video: ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా తల్లి.. పబ్లిక్‌లో రెచ్చిపోయి రచ్చ చేసిన యువతి..
ఇప్పటికే చాలా మంది ఈ రీల్స్ కు బానిసలుగా మారారు. కొంతమంది తమలో దాగిఉన్న టాలెంట్ ను బయట పెడుతుంటే మరికొంతమంది మాత్రం ఇష్టమొచ్చినట్టు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

మొన్నటి వరకు టిక్ టాక్ అంటూ కొంతమంది పిచ్చి పిచ్చి చేష్టలు చేసి ప్రాణాల మీదకు తీసుకొచ్చుకున్నారు. కొంతమంది జైలు పాలు కూడా అయ్యారు. ఇక టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇప్పుడు ఇన్స్టా గ్రామ్ రోల్ రీల్స్ పేరుతో మరోసారి అదే పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ రీల్స్ కు బానిసలుగా మారారు. కొంతమంది తమలో దాగిఉన్న టాలెంట్ ను బయట పెడుతుంటే మరికొంతమంది మాత్రం ఇష్టమొచ్చినట్టు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు. రోడ్లు మీద.. రైల్‌ల్లో.. ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు.
ఇప్పటికే కొంతమంది మెట్రో రైల్ లో కూడా వీడియోలు చేస్తున్నారు. అంతమంది జనం ఉన్నారని కూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు. రద్దీగా ఉండే ఢిల్లీ మెట్రో రైలులోని జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఓ అమ్మాయి డాన్స్ చేసింది.
ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే కొంతమంది ఆమె డాన్స్ ను మెచ్చుకుంటుంటే.. చాలా మంది మాత్రం ఆ అమ్మాయి డాన్స్ పై మండిపడుతున్నారు. మెట్రో రైలు ఇలా ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం సరికాదు అని పోలీసులు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ‘RRR’ మెమెను షేర్ చేసింది మరియు మెట్రో రైళ్లలో ప్రయాణించేటప్పుడు రీల్స్ లేదా డ్యాన్స్ వీడియోలను చిత్రీకరించవద్దని ప్రజలను కోరింది. అయినా కూడా కొంతమంది ఇలా ఇష్టమొచ్చినట్టు డాన్స్ లు చేస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు.
Ye kya hai ? ??@OfficialDMRC@DCP_DelhiMetro pic.twitter.com/M6wTr59e1R
— Major D P Singh (@MajDPSingh) March 2, 2023
