Watch: స్కైడైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఆకాశంలోనే గుండెపోటు..! ఆ హృదయ విదారక వీడియో వైరల్
ఒక హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో స్కైడైవింగ్ ఒక స్కైడైవర్ ఊహించని పెను ప్రమాదానికి గురయ్యాడు. వీడియోలో, స్కైడైవర్ ఆకాశంలో ఉండగానే తన బ్యాలెన్స్ కోల్పోయి అపస్మారక స్థితిలో అదుపు లేకుండా పడిపోతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే, మరికొన్ని ఆలోచింపజేసివిగా ఉంటాయి. మరికొన్ని సంతోషాన్నిస్తే.. ఇంకొన్ని విషాదంగా ఉంటాయి. అలాంటిదే ఒక హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో స్కైడైవింగ్ ఒక స్కైడైవర్ ఊహించని పెను ప్రమాదానికి గురయ్యాడు. వీడియోలో, స్కైడైవర్ ఆకాశంలో ఉండగానే తన బ్యాలెన్స్ కోల్పోయి అపస్మారక స్థితిలో అదుపు లేకుండా పడిపోతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
నివేదిక ప్రకారం, ఈ వైరల్ వీడియో 2015 సంవత్సరం నాటిదని తెలిసింది. ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న స్కైడైవర్‌ను ఆస్ట్రేలియాలోని పెర్త్ నివాసి క్రిస్టోఫర్ జోన్స్‌గా గుర్తించారు. క్రిస్టోఫర్ జోన్స్ స్కైడైవింగ్ చేస్తున్నప్పుడు స్వేచ్ఛగా గాల్లో ఎగిరిపోతుండగా, అతనికి గుండెపోటు వచ్చి అమాంతంగా పడిపోయాడు. ఆ తరువాత వెంటనే అతని ట్రైనర్ షెల్డన్ మెక్‌ఫార్లేన్ అతన్ని కాపాడటానికి రంగంలోకి దూకాడు. మాక్‌ఫార్లేన్ దాదాపు 4,000 అడుగుల ఎత్తులో జోన్స్‌ను పట్టుకుని రిప్ త్రాడును లాగాడు. మాక్‌ఫార్లేన్ ఎంతగానో శ్రమించి జోన్స్‌ని స్పృహలోకి తీసుకురాగలిగాడు. ఈ సంఘటన మొత్తం ట్రైనర్ షెల్డన్ మెక్‌ఫార్లేన్ హెల్మెట్‌లో తన కెమెరాతో బంధించాడు.
వీడియో ఇక్కడ చూడండి..
Man has seizure while skydiving and gets saved by fellow skydiver during a free fall pic.twitter.com/1hZxj3nR8g
— Crazy Clips (@crazyclipsonly) February 7, 2025
ఈ సంఘటన గురించి మాక్‌ఫార్లేన్ మాట్లాడుతూ, పారాచూట్ లేకుండా అతను నేలపై పడిపోతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పాడు. కానీ పరిస్థితులు మన చేతిలో ఉండవని తెలిసిందన్నారు. అతని పరిస్థితి గమనించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగానే పారాచూట్ కిందకు దించడం మంచిది అయిందని చెప్పారు. సమయానికి జోన్స్ పరిస్థితిని గమనించటం వల్లే అతన్ని కాపాడగలిగామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ఇంటర్‌నెట్‌లో ఇప్పటికీ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



