AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: ప్రాణాలతో చెలగాటం.. రాజనాగుతో యువకుడి ముద్దులాట.. క్షణంలో మారిపోయిన సీన్!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని ప్రమాదకరమైన విన్యాసాలతో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాములలో ఒకటిగా పేరుగాంచిన రాజనాగుతో ఓ వ్యక్తి చేసిన సాహసం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Shocking Video: ప్రాణాలతో చెలగాటం.. రాజనాగుతో యువకుడి ముద్దులాట.. క్షణంలో మారిపోయిన సీన్!
Young Man Kisses Snake
Balaraju Goud
|

Updated on: Jul 16, 2026 | 4:32 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని ప్రమాదకరమైన విన్యాసాలతో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాములలో ఒకటిగా పేరుగాంచిన రాజనాగుతో ఓ వ్యక్తి చేసిన సాహసం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సుమారు 52 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ వ్యక్తి భారీ రాజనాగు పక్కనే ప్రశాంతంగా కూర్చుని కనిపించాడు. అతని ముఖంలో ఎలాంటి భయాందోళనలు కనిపించవు. కొద్దిసేపటి తర్వాత అతను లేచి నిలబడి, స్టైల్‌గా తన జుట్టును సరిచేసుకుంటూ నేరుగా నాగుపాము వైపు నడుచుకుంటూ వెళ్లాడు. అనంతరం రాజనాగు తల భాగానికి దగ్గరగా వెళ్లి దానిని ముద్దుపెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అదే క్షణంలో నాగుపాము మెరుపు వేగంతో దాడికి ప్రయత్నించింది. ఈ ఘటన వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

అదృష్టవశాత్తూ, ఆ వ్యక్తి వెంటనే వెనక్కి తప్పుకోవడంతో పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. క్షణం ఆలస్యమైనా తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని వీడియో చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. రాజనాగు వంటి విషసర్పాలతో ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రాణాలకు ముప్పు అని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @junglesurvivor7 అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇప్పటికే దీనికి 7 లక్షలకు పైగా వీక్షణలు లభించగా, వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. అయితే ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించబడిందనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు.

వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “ఇది మృత్యు ముద్దు లాంటిదే”, “వీడియో చూస్తుంటేనే గుండె ఆగినంత పని అయింది”, “పాములను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు”, “వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అడవి జంతువులు, ముఖ్యంగా విషసర్పాల నుంచి సురక్షిత దూరం పాటించడం అత్యంత అవసరం. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకరించకూడదని వారు సూచిస్తున్నారు.

షాకింగ్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!