Viral News: అదిరిపోయే ఉద్యోగం.. రూ.88 లక్షలు జీతం.. కానీ షరతులు వర్తిస్తాయి.!
Work In A Private Island: మీ జీవిత భాగస్వామితో కలిసి పని చేయాలనుకుంటున్నారా.? అందుకు తగిన ఉద్యోగం కోసం చూస్తున్నారా.? అయితే...
Work In A Private Island: మీ జీవిత భాగస్వామితో కలిసి పని చేయాలనుకుంటున్నారా.? అందుకు తగిన ఉద్యోగం కోసం చూస్తున్నారా.? అయితే మీకో గుడ్ న్యూస్. ఓ అందమైన దీవిలో అదిరిపోయే ఉద్యోగం మీకోసం వెయిట్ చేస్తోంది. ఏడాదికి ఏకంగా రూ. 88 లక్షల జీతం. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పని చేసుకోవచ్చు. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. మరి ఆ వివరాలేంటో చూద్దాం..
బహామాస్ లో నివసిస్తున్న ఓ ఉన్నత కుటుంబానికి ప్రైవేటు దీవి.. అందులో పెద్ద బంగ్లా ఉంది. మీరు ఆ రెండింటిని సంరక్షితే చాలు ఏడాదికి రూ. 88 లక్షలు అంటే నెలకు రూ. 7.3 లక్షలు మీ అకౌంట్ లో జమ అవుతాయి. కేవలం పెళ్లయిన జంటకు మాత్రమే ఈ ఉద్యోగం చేయవచ్చు. ఈ పనిలో కుదిరే భార్యాభర్తలు ఫ్లోరిడా, బహామాస్ లో ఆ కుటుంబానికి గల అన్ని ఇళ్లలో పని చేయాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డ్యూటీ ఉంటుంది. ఆ జంటకు హెల్త్ కేర్ డెంటల్ బెనిఫిట్స్ తో పాటు ఓ కారును కూడా ఇస్తారు.
అంతేకాకుండా హౌస్ మేనేజ్ మెంట్ మైంటైనెన్స్ తెలుసుకున్న వారికే ఈ ఉద్యోగం ఇస్తారు. ఒకవేళ జంట పని తీరు నచ్చితే ఈ ఉద్యోగంలో జీవితకాలం కొనసాగిస్తారు. కాగా, ఇప్పటికే ఈ ఉద్యోగానికి లక్షల్లో దరఖాస్తులు రాగా.. మంచి అనుభవం ఉన్నవారికే ఉద్యోగం ఇస్తామని యజమానులు అంటున్నారు.
ఇవి చదవండి:
ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..
Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?