AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: జిరాఫీ పిల్ల తప్పటడుగులు.. మనసులను హత్తుకుంటున్న వీడియో.. నెటిజన్లు ఫిదా..

Viral Video: పసిపిల్లలు అడుగులు వేయడానికి దాదాపు సంవత్సర కాలం పడుతుంది. ఇక వారు అడుగులు వేయడానికి పడే అవస్థలు చూస్తుంటే

Viral News: జిరాఫీ పిల్ల తప్పటడుగులు.. మనసులను హత్తుకుంటున్న వీడియో.. నెటిజన్లు ఫిదా..
Baby Giraffe
Rajitha Chanti
|

Updated on: May 07, 2021 | 5:01 PM

Share

Viral Video: పసిపిల్లలు అడుగులు వేయడానికి దాదాపు సంవత్సర కాలం పడుతుంది. ఇక వారు అడుగులు వేయడానికి పడే అవస్థలు చూస్తుంటే ఒక వైపు సంతోషం కలిగిన మరోవైపు జాలి కూడా వేస్తుంటుంది. ఇక పసిపిల్లలు మొదటి అడుగు వేసి మరో అడుగు వేయడానికి మధ్య కింద పడిపోతుంటారు. అలా ప్రయత్నం చేసి చేసి చివరకు అడుగులు వేయడం.. పరిగెత్తడం వంటివి చేస్తుంటారు. అయితే సాధారణంగా ఇలా పసిపిల్లలు చేసే పనులు. మరీ జంతువుల పరిస్థితి ఎంటీ.. అవి పుట్టగానే పరిగెడతాయా ? వెంటనే నడుస్తాయా ? అనేది చాలా మందిలో సందేహం ఉండనే ఉంటుంది. అయితే అప్పుడే పుట్టిన జంతువులు కూడా వేయడానికి నానా అవస్థలు పడుతుంటాయి. ప్రయత్నం చేసి చివరకు అనుకున్నది సాధిస్తాయి. అలాగే ఓ జిరాఫీ పిల్ల కూడా తనకు తానుగా నిలబడటానికి చేసిన ప్రయత్నం చూస్తుంటే మనసును హత్తుకుంటుంది. ఇక నిల్చోవడానికి ఆ జిరాపీ పిల్ల చేసిన ప్రయత్నానికి దానిని మెచ్చుకోకుండా ఉండలేరు. ప్రయత్నించకుండా ఒడిపోవడం కాకుండా.. ప్రయత్నాలు విఫలమైన మళ్లీ మళ్లీ ప్రయత్నించి చివరకు అనుకున్నది సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. ఓ జూపార్కులో అప్పుడే పుట్టిన జిరాఫీ పిల్ల అడుగులు వేయడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తుంది. అది మొదట నిల్చోవడానికి ప్రయత్నించి వెంటనే కింద పడిపోతుంది. అలా రెండు మూడు సార్లు ప్రయత్నీస్తూనే ఉంటుంది. ప్రతి సారి కిందపడిపోయిన ఏమాత్రం నిరాశ పడకుండా తిరిగి ప్రయత్నిస్తూ.. చివరకు ఆ జిరాఫీ పిల్ల నిలబడింది. దాదాపు 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను BRFC అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 2 లక్షల వ్యూస్ వచ్చాయి. అడుగుల కోసం ఆ జిరాఫీ పిల్ల ప్రయత్నించిన తీరు చూసిన నెటిజన్లు.. తమదైన శైలీలో కామెంట్స్ పెడుతున్నారు. మరీ ఆ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయ్యండి.

ట్వీట్..

Also Read: కరోనా కష్టకాలంలో సల్మాన్ ఖాన్ టీం పెద్దమనసు.. ‘రాధే’ సినిమా వసూళ్లను అలా ఉపయోగించనున్నారట..

బాలకృష్ణకు జోడీగా పవన్ హీరోయిన్.. మరోసారి లక్కీ హీరోయిన్‏కే ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్..