కసరత్తుల కోసం జిమ్‌కు వెళ్లారు.. సీన్ కట్ చేస్తే జుట్లు పట్టుకుని మరీ పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు.. షాకింగ్ వీడియో
వైరల్ వీడియోలో.. జిమ్‌లో కొందరు మహిళలు వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ సమయంలో వెయిట్ లిఫ్టింగ్ వద్ద ఒక మహిళ తన వంతు కోసం ఎదురు చూస్తుండగా..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వినోదభరితమైన, విచిత్రమైన ఫన్నీ వీడియోలు ఉంటాయి. ఇవి వచ్చిరాగానే ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంటాయి. వీటినే నెటిజన్లు కూడా తెగ షేర్ చేస్తుంటారు. తాజాగా.. సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో జిమ్‌లో ఉన్న మహిళల మధ్య జరిగిన క్రేజీ ఫైట్‌కు సంబంధించినది. సీసీటీవీలో రికార్డయిన ఈ వీడియోలు మహిళలు వెయిట్ మెషిన్ విషయంలో తీవ్రంగా గొడవ పడుతూ కనిపించారు. అంతటితో ఆగకుండా ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో.. ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని మరి కొట్టుకున్నారు.
వైరల్ వీడియోలో.. జిమ్‌లో కొందరు మహిళలు వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ సమయంలో వెయిట్ లిఫ్టింగ్ వద్ద ఒక మహిళ తన వంతు కోసం ఎదురు చూస్తుండగా.. ఇంతలో మరో మహిళ అక్కడకు వచ్చింది. వెయిట్ లిఫ్టింగ్ పరికరం కోసం ఎదురు చూస్తున్న మహిళను పక్కకు నెట్టడంతో.. ఆమె కూడా తిరగబడింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఒకరినొకరు జుట్టును పట్టుకుని కొట్టుకున్నారు. దీంతో అవాక్కయిన మిగతా మహిళలు వారిద్దరినీ విడదీసేందుకు తెగ ప్రయత్నించారు. అయినప్పటికీ ఇద్దరూ జట్టు లాక్కుంటూ కనిపించారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..
మహిళల మధ్య ఫైట్.. వీడియో చూడండి..
Kalesh Inside GYM for Smith Machine pic.twitter.com/KXy6v9UyWj
— r/Bahar Ke Kalesh (@Baharkekalesh) October 9, 2022
కాగా.. జిమ్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌లో r/Bahar Ke Kalesh అనే యూజర్ పోస్ట్ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేది మాత్రం పేర్కొనలేదు.
కాగా.. మహిళల ఫైట్‌కు సంబంధించిన వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. మహిళల మధ్య ఎప్పుడూ ఇలాంటి సీన్లే కనిపిస్తాయంటూ చమత్కరిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..
