Viral video: ఓరీ దేవుడో ఈ తల్లి ధైర్యానికి దండం పెట్టాల్సిందే..! ఆపరేషన్ థియేటర్‌లో గర్భిణీ ఏం చేసిందంటే..?
ఆపరేషన్ థియేటర్లో ఇదంతా ఎవరో వీడియో రికార్డ్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఈ వీడియోపై నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ఆమె నొప్పి నుండి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తుందని కొందరు అంటున్నారు. మరికొందరు ఆపరేషన్ థియేటర్ రీలు ఎందుకు చేస్తున్నారని మరికొందరు ప్రశిస్తున్నారు. మొత్తానికి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు.
బిడ్డకు జన్మనివ్వడం ఏ స్త్రీకైనా పునర్ జన్మతో సమానం అంటారు. ప్రసవ వేదన అనేది శరీరంలోని 20 ఎముకలు ఒకేసారి విరిగితే కలిగే బాధతో సమానమని చెబుతారు.. తన బిడ్డకు ప్రపంచపు వెలుగు చూపాలంటే తల్లి ఈ బాధను భరించాలి. ముఖ్యంగా నార్మల్ డెలివరీ చాలా కష్టం. అయితే, ఆధునిక వైద్య విధానంలో ఈ బాధను తగ్గించే మార్గం ఉంది. నార్మల్ డెలివరీ స్థానంలో సిజేరియన్ డెలివరీ ఆప్షన్ వచ్చింది. అందువల్ల, చాలా మంది గర్భిణీలు సిజేరియన్ డెలివరీని ఆశ్రయిస్తుంటారు. అది కూండా ప్రమాదం తక్కువేమీ కాదు. అందుకే గర్భిణీలు ఆపరేషన్ థియేటర్‌కి వెళ్లే వరకు దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటారు. అలాంటి ఆపరేషన్ సమయంలో ఎవరైనా భగవంతుడిని ధ్యాన్నిస్తూ పాట పాడటం మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ, అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వీడియో చూసిన కొందరు మహిళపై ప్రశంసలు కురిపిస్తే ఆపరేషన్ థియేటర్‌లో వీడియో రికార్డు చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఓ ఆపరేషన్ థియేటర్ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో ఒక మహిళ ఆపరేషన్ టేబుల్‌పై పడుకుని ఉంది. ఆమె చుట్టూ వైద్యులు, నర్సుల బృందం ఉంది. అందరూ ఆకుపచ్చ ఆప్రాన్ ధరించి ఉన్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం చాలా మందికి తెలుసు. కానీ ఈసారి ఆపరేషన్ థియేటర్ లోపల టేబుల్ మీద పడుకున్న మహిళ పాడటం ప్రారంభించింది.
ఒక వైపు వైద్యులు ఆమె సి-సెక్షన్ డెలివరీలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆ స్త్రీ “శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ్ నారాయణ వాసుదేవ” అని పాడుతుంది. ఇంత మధురమైన పాట అందరి హృదయాలను గెలుచుకుంది. ఆపరేషన్ సమయంలో తనను తాను నిశ్చలంగా ఉంచుకుని ఇంత అందమైన పాట పాడినందుకు వైద్యులు ఆమెను అభినందించారు. అందరూ భయంతో వణికిపోతే తానే స్వయంగా మధురమైన స్వరంతో పాట పాడుతోంది.. అందుకే నెటిజన్లు ఆ మహిళ ఆత్మవిశ్వాసం, బుద్ధిబలాన్ని కొనియాడుతున్నారు.
స్త్రీ ప్రసవ సమయంలో ‘శ్రీ కృష్ణ గోవింద హరే మురారి…’. ఆమె భజన పాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఎవరో వీడియో రికార్డ్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్ల నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ఆమె నొప్పి నుండి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తుందని కొందరు అంటున్నారు. మరికొందరు ఆపరేషన్ థియేటర్ రీలు ఎందుకు చేస్తున్నారని ప్రశిస్తున్నారు.
“A Moment of goosebumps”
She literally prayed to give eternal life to the baby🥹 pic.twitter.com/ViPOSuaffS
— Fenil Kothari (@fenilkothari) June 19, 2024
వీడియోను పంచుకుంటూ, సోషల్ మీడియా వినియోగదారు తన బిడ్డ ఉజ్వల భవిష్యత్తు కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు రాశారు. ఈ మహిళ చాలా ధైర్యవంతురాలు అని ఒకరు రాశారు. తల్లి కావడం అంత సులభం కాదని మరొకరు రాశారు. ఆపరేషన్ థియేటర్‌లో కూడా ఇలా రీల్స్ చేస్తున్నారంటూ మరికొందరు మండిపడ్డారు. రీళ్లపై ఇంత పిచ్చి పట్టడం సరికాదని అంటున్నారు. ఈ మహిళ నిజంగా చాలా ధైర్యవంతురాలు అని ఒకరు రాశారు. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..