AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాబోయ్‌ రిషికేశ్‌లో తుఫాను బీభత్సం.. గాలిపటంలా ఎగిరిన తెప్ప.. గంగా నదిలో పర్యాటకులు..!

నది ఒడ్డున ఉన్న తెప్పపై పలువురు కూర్చొని ఉండగా ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో తెప్ప బోల్తా పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. తెప్ప గైడ్ అందర్నీ పడవ ఎక్కమని కోరడం వీడియోలో వినబడుతుంది. పడవ దిగిన తర్వాత చాలా మంది రాళ్లపై కూర్చోవడం, కొందరు తెప్పను పట్టుకుని..

Viral Video: బాబోయ్‌ రిషికేశ్‌లో తుఫాను బీభత్సం.. గాలిపటంలా ఎగిరిన తెప్ప.. గంగా నదిలో పర్యాటకులు..!
River Rafting
Jyothi Gadda
|

Updated on: Jun 20, 2024 | 3:45 PM

Share

దేశంలోని చాలా రాష్ట్రాలు తీవ్రమైన ఎండలు, వేడితో ఉడికిపోతున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న కొండ ప్రాంతాల పర్యాటనకు ప్రజలు ఎక్కువగా క్యూ కడుతున్నారు. అలాంటి ప్రదేశాలలో ఉత్తరప్రదేశ్ ప్రజల మొదటి ఎంపిక ఉత్తరాఖండ్‌. ఇక్కడ అనేక జిల్లాలు పర్యాటకానికి, చల్లదనానికి ప్రసిద్ధి. అందుకే వేసవిలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు, యాత్రికులు రిషికేశ్ ను సందర్శిస్తారు. అలాంటిది రిషికేశ్‌కు సంబంధించి భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో గంగా నదిలో రివర్ రాఫ్టింగ్ తెప్ప గాలిలో ఎగురుతున్న దృశ్యం అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది.

జూన్ 19న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చిన తుపాను నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలిసింది. తుఫాను ధాటికి గంగా నదిలో వాటర్ రాఫ్టింగ్ చేస్తున్న ప్రజలపై కూడా ప్రభావం చూపింది. ఈదురుగాలుల కారణంగా పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. అయితే గాలి బలంగా వీస్తుండడంతో తెప్ప గాలిలో ఎగిరింది. అందులో కూర్చున్న వారు కింద పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్‌ నెట్‌లో వైరల్‌గా మారింది. తెప్ప గాలిలో ఎగురుతున్న దృశ్యం చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు..

ఇవి కూడా చదవండి

చాలా మంది పర్యాటకులు నదిలో రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు మధ్యాహ్నం ఒక్కసారిగా బలమైన తుఫాను వచ్చింది. దీంతో ఒక తెప్ప బోల్తా పడింది. కొద్దిసేపట్లో అది గాల్లోకి ఎగిరిపోయింది. అదృష్టవశాత్తు ఈ సమయంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నది ఒడ్డున ఉన్న తెప్పపై పలువురు కూర్చొని ఉండగా ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో తెప్ప బోల్తా పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. తెప్ప గైడ్ అందర్నీ పడవ ఎక్కమని కోరడం వీడియోలో వినబడుతుంది. పడవ దిగిన తర్వాత చాలా మంది రాళ్లపై కూర్చోవడం, కొందరు తెప్పను పట్టుకుని పడుకోవడం, అది ఊడిపోకుండా ఉండడం వీడియోలో కనిపిస్తుంది.

మరో వీడియోలో తెప్ప ఎగురుతూ నది మధ్యలోకి చేరినట్లు చూడవచ్చు. ఈదురు గాలుల కారణంగా ఎత్తుకు వెళ్లిన తెప్ప వేగంగా కిందకు వచ్చి నదిలో పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..