Watch: అయ్‌బాబోయ్ ఇదేం డాన్సండీ..! గ్యాస్ సిలిండర్‌పై నిలబడి నమస్కార భంగిమ.. తలపై మరొకటి
వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు సిలిండర్‌ను తాకకుండా మహిళ బ్యాలెన్స్ చేసిన తీరుకు షాక్ అవుతున్నారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమె బ్యాలెన్సింగ్ సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఈ మహిళ స్టంట్ నిస్సందేహంగా ప్రమాదకరమే. కొంచెం బ్యాలెన్స్‌తో ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు ఆమె ధైర్యాన్ని కొనియాడారు.
ఈ రోజుల్లో మనం ఇంటర్నెట్‌లో రకరకాల కంటెంట్‌లను చూస్తున్నాం. అలాంటి వాటిల్లో ఎక్కువ భాగం విద్యా, నైపుణ్యాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి.. అలాగే గ్లామరస్ కూడా. ఇక మరి కొంతమంది కంటెంట్ క్రియేటర్‌లు విభిన్న స్టంట్‌లను చూపుతారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వ్యూస్, ఫాలోవర్స్ కోసం ఏదైనా చేస్తుంటారు. ఎక్కువ వ్యూస్ ఆశతో అలాంటి వారు తమ జీవితాలను కూడా పందెం వేయడానికి వెనుకాడరు. అలాంటిదే ఇక్కడ ఒక మహిళ కొత్త స్టంట్స్ తో సోషల్ మీడియా పేజీల్లో దర్శనమిచ్చింది. ఈసారి హర్యానాకు చెందిన ఓ మహిళ అలాంటి డేరింగ్ స్టంట్ చేసి చూపించింది. ఆమె బ్యాలెన్స్ గేమ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
హర్యానాకు చెందిన కంటెంట్ క్రియేటర్ అయిన నీతూ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి జనవరిలో ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ తో ఆమె స్టంట్ చేసింది.ఆ వైరల్ వీడియోలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ కనిపించింది. మరో సిలిండర్ మహిళ తలపై ఉంది. ఆ సిలిండర్‌ను తలపై పెట్టుకుని నేలపై ఉంచిన గ్యాస్ సిలిండర్‌పై లేచి నిలబడుతుంది.
నేలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌పై నిలబడిన ఆమె తలపై మరో సిలిండర్ పెట్టుకుంది. అంతేకాడు.. ఆమె తన రెండు చేతులతో సిలిండర్‌ను పట్టుకోకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండా నేలపై ఉన్న సిలిండర్ మీద నిలబడింది. పైగా తలపై ఉన్న సిలిండర్‌ను కూడా ఏ మాత్రం పట్టుకోలేదు. మొదట ఆమె తలపై గాజు గ్లాస్ లాంటిది పెట్టుకుని ఉంది. దాని పైన సిలిండర్ ఉంది. ఆమె నేలపై ఉన్న సిలిండర్ మీద ఇలా నిలబడి ఉంది. రెండు చేతులతో నమస్కార భంగిమలో నిల్చుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు సిలిండర్‌ను తాకకుండా మహిళ బ్యాలెన్స్ చేసిన తీరుకు షాక్ అవుతున్నారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమె బ్యాలెన్సింగ్ సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఈ మహిళ స్టంట్ నిస్సందేహంగా ప్రమాదకరమే. కొంచెం బ్యాలెన్స్‌తో ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు ఆమె ధైర్యాన్ని కొనియాడారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..