AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వావ్‌.. వాట్ ఏ ఐడియా సర్‌జీ.! పాడైపోయిన ఏసీని ఇలా కూడా వాడొచ్చా.. !!

వేడి భయంకరంగా పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీలు వేగంగా అమ్ముడవుతున్నాయి. అధిక వినియోగంతో ఏసీలు కూడా చాలా సార్లు చెడిపోతున్నాయి. ఇప్పుడు ఓ వ్యక్తి ఏసీ అవుట్‌డోర్ యూనిట్ లోపభూయిష్టంగా ఉన్న ఫీట్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ దేశీ జుగాఢ్‌ని చూసి ప్రజలు షాక్ అవుతున్నారు.

Viral Video: వావ్‌.. వాట్ ఏ ఐడియా సర్‌జీ.! పాడైపోయిన ఏసీని ఇలా కూడా వాడొచ్చా.. !!
Ac Outdoor Unit Into A Big Speaker
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2024 | 3:53 PM

Share

విరిగిపోయిన అవుట్‌డోర్ ఏసీ స్పీకర్‌గా మారింది! అదేంటని ఆశ్చర్యపోతున్నారు కదా..? AC నుండి స్పీకర్లను తయారు చేయడం ఎలా సాధ్యమవుతుందని సందేహపడుతున్నారు కదా.? కానీ, నిజంగానే ఇలాంటి వింత ఆలోచనలన్నీ భారతదేశ ప్రజల మెదడులో పుట్టుకొస్తున్నాయి. అలాంటి విన్యాసాలన్నీ మన దేశీయులకు ఎడమచేతి వాటం ఆటలు. మరీ ముఖ్యంగా పనికిరాని వస్తువుల నుండి మిగిలిపోయిన వాటిని ఉపయోగించి అనేక అద్భుత ఆవిష్కరణలు తయారు చేస్తున్నారు. అయితే ఔట్ డోర్ ఏసీ నుంచి స్పీకర్లను తయారు చేయడం భారతదేశంలో ఇదే తొలిసారి. మీరు ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచాన్ని చూస్తే, కొంతమంది వ్యక్తుల వింతలన్నీ మీకు కనిపిస్తాయి. అటువంటి వ్యక్తి భారీ స్పీకర్‌ను తయారు చేయడానికి విరిగిన AC అవుట్‌డోర్ యూనిట్‌ను ఉపయోగించారు! ఇది చూస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు..ఏసీని ఎవరైనా ఇంట్లో వాడుకుంటారు.. కానీ, ఇలా బయట కూడా వినియోగించవచ్చునని ఇది చూశాకే తెలుస్తుంది.

ఈ వీడియో ఇటీవల @sk_service___ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేయబడింది. కెమెరామెన్ AC అవుట్‌డోర్ యూనిట్‌పై దృష్టి పెట్టాడు. ముందుగా వీడియో చూడగానే..అది మీ గదిని చల్లగా మార్చే కూల్ ఏసీగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ ఏసీ ఔట్ డోర్ యూనిట్ దగ్గర నుంచి చూస్తే మాత్రం మీ తల తిరుగుతుంది. పాడైపోయిన ఏసీ ఔట్ డోర్ యూనిట్ ను పెద్ద స్పీకర్ గా మార్చేశాడు ఆ మహానుభావుడు.

ఇవి కూడా చదవండి

ఆ ఏసీ యూనిట్‌లో స్పీకర్లు కాకుండా ఇతర విషయాలు కూడా కనిపిస్తాయి. పనికిరాని వస్తువులను పారేయకూడదనే సత్యాన్ని ఈ అద్భుతమైన సంఘటనను చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు 1.5 లక్షలకు పైగా వీక్షణలు, 40 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వైరల్ వీడియోను కూడా షేర్ చేశారు. చాలా మంది వినియోగదారులు ఈ వైరల్ వీడియోను కూడా లైక్‌ చేశారు. మళ్లీ మళ్లీ షేర్‌ చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..