Viral Video: రెజ్లింగ్ రింగ్‌లోకి దూకిన యువతి.. మామూలు రచ్చ కాదండోయ్..!
Viral Video: రెజ్లింగ్ గేమ్‌ను చూసేందుకు వచ్చిన ఓ యువతి, ఏకంగా రెజ్లింగ్ రింగ్‌లోకి దిగి మహిళా రెజ్లర్లకు పంచులతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
Viral Video: రెజ్లింగ్ గేమ్‌ను చూసేందుకు వచ్చిన ఓ యువతి, ఏకంగా రెజ్లింగ్ రింగ్‌లోకి దిగి మహిళా రెజ్లర్లకు పంచులతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సివంగిలా దూకిన యువతి, ఇద్దరు మహిళా రెజ్లర్లకు పంచులిచ్చింది. తనతో తలపడేవారు ఉన్నారా అంటూ ఆడియన్స్‌కు సవాల్ విసిరింది. పంజాబ్‌లో జరిగిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీ వెయిట్ మాజీ ఛాంపియన్ ఖలీ ఈ రెజ్లింగ్ సంస్థను నడుపుతున్నాడు. ఖలీ అకాడమీలోని రెజ్లింగ్ రింగ్‌లో ఇద్దరు మహిళా రెజ్లర్ల మధ్య పోటీ జరుగుతుంది. ఇంతలో ఉన్నట్టుంటి ఒక యువతి ప్రేక్షకులను నెట్టుకుని బాక్సింగ్ బరిలోకి దిగుతుంది. ఏం చేస్తున్నావు అని ఇద్దరు రిఫరీలు అడిగినా ఆమె పట్టించుకోదు. తొలుత బ్లూడ్రెస్ వేసుకున్న మహిళ ముఖంపై పంచులిచ్చి, మరో మహిళను గేమ్‌ను నుంచి నాకౌట్ చేస్తుంది. ఇక చివరగా ఆ గేమ్‌లో సామాన్య యువతి విక్టరీ సాధిస్తోంది.
View this post on Instagram