AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: బాల్య జ్ఞాపకాలు ఎప్పుడూ మధురమే.. జారుడు బల్లపై ఎక్కిన మహిళ.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

బాల్యం ఎంతో మధురమైనది. చిన్నప్పుడు చేసే పనులు, చిలిపి చేష్ఠలు మరపురాని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఎంత వయసు వచ్చినా.. గతం తాలుకూ గుర్తులు వెంటాడుతూనే ఉంటాయి. స్నేహితులతో కలిసి ఆడుకోవడం,..

Video Viral: బాల్య జ్ఞాపకాలు ఎప్పుడూ మధురమే.. జారుడు బల్లపై ఎక్కిన మహిళ.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Woman Falling From Slide
Ganesh Mudavath
|

Updated on: Sep 22, 2022 | 8:34 PM

Share

బాల్యం ఎంతో మధురమైనది. చిన్నప్పుడు చేసే పనులు, చిలిపి చేష్ఠలు మరపురాని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఎంత వయసు వచ్చినా.. గతం తాలుకూ గుర్తులు వెంటాడుతూనే ఉంటాయి. స్నేహితులతో కలిసి ఆడుకోవడం, సైకిల్ తొక్కడం, ఈతకు వెళ్లడం, తోటల్లో చిన్న చిన్న దొంగతనాలు చేయడం వంటివి అద్భుతమైన మెమోరీస్. ఇప్పటి కాలం పిల్లలకు ఇవన్నీ తెలియకపోవడం కాస్త అవేదన కలిగించే విషయం. పార్కుల్లో, పాఠశాల్లో ఏర్పాటు చేసే జారుడు బల్లలు మనందరికీ తెలిసిందే. వీటిపైకి ఎక్కి.. రయ్యిమంటూ కిందికి జారుతుంటే కలిగే థ్రిల్లే వేరు. ఇంటర్నెట్‌లో చాలా రకాల వీడియోలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని ఆవేదన కలిగిస్తాయి. చిన్నప్పుడు మనమందరం స్వింగ్‌లు, రైడ్‌లతో ఇష్టంగా ఆటలాడుకున్నాం. కొన్ని సార్లు పిల్లలే కాకుండా పెద్దలు కూడా రైడ్‌ను ఇష్టపడుతుంటారు. బాల్యానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీటిని చూశాక మన అభిప్రాయం మారిపోతుంది. ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంటుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న క్లిప్ లో ఓ మహిళ చిన్న పిల్లలు ఆడే జారుడు బల్లపైకి ఎక్కుతుంది. ఆమె పై నుంచి కిందికి జారేందుకు ప్రయత్నిస్తుంది. కిందికి వచ్చే సమయంలో ఆమె కంట్రోల్ కోల్పోతుంది. కిందికి రాగానే బొక్కబోర్లా పడిపోతుంది. కొంత సమయం తర్వాత ఆమె పైకి లేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ అయింది. వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “ఆమెకు ఏమీ జరగలేదు- ఆమె ఆనందిస్తున్నందుకు సంతోషంగా ఉందని తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ? MAHI ? (@butterfly__mahi)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం