Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divorce Party: 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఎండ్ కార్డ్.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న మహిళ..!

Divorce Party: సమాజంలో పురుషుడు విడాకులు తీసుకోవడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అదే మహిళ విడాకులు కోరితే.. బయటి వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ముందు..

Divorce Party: 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఎండ్ కార్డ్.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న మహిళ..!
Divorce
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 25, 2021 | 9:51 AM

Divorce Party: సమాజంలో పురుషుడు విడాకులు తీసుకోవడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అదే మహిళ విడాకులు కోరితే.. బయటి వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ముందు ఆమె కుటుంబ సభ్యులే అంగీకరించరు. ఇక సమాజం అయితే చిన్న చూపు చూస్తుంది. విడాకులు తర్వాత ఆమెకు జీవితమే లేదన్నట్లు ప్రవర్తిస్తారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా తాజాగా ఓ మహిళ విడాకులు తీసుకున్న సందర్భంగా ఘనంగా పార్టీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ విడాకుల పార్టీకి చెందిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వివరాల్లోకెళితే.. సోనియా గుప్తా అనే మహిళకు 2003లో వివాహం జరిగింది. భర్తతో కలిసి లండన్‌ వెళ్ళి కొత్త జీవితంలో అడుగు పెట్టింది. అప్పటి వరకు స్వతంత్ర భావాలతో ఫ్రీ బర్డ్‌లా బ్రతికిన సోనియాకు వివాహ జీవితం జైలులా మారింది. అత్తారింట్లో అడుగడుగునా పెట్టే ఆంక్షలు భరించలేకపోయింది. ఇంకోవైపు సోనియా, ఆమె భర్త మధ్య బంధం కూడా పెద్దగా బలపడలేదు. 17 ఏళ్లు అలా నెట్టుకొచ్చిన సోనియా.. ఇక తన భర్తతో కలిసి ఉండలేకపోయింది. భర్తనుంచి విడాకులు తీసుకోవాలనుకుంది. అదే విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. ఇంకేముంది వారంతా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అలాంటివేం కుదరవని తేల్చి చెప్పారు.

ఆ సమయంలో సోనియా గుప్తాకు స్నేహితులు మద్దతుగా నిలిచారు. ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చూపారు. ఏషియన్‌ సింగిల్‌ పేరెంట్‌ నెట్‌వర్క్‌ నుంచి కూడా ఆమెకు మద్దతు లభించింది. మూడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సోనియాకు విడాకులు వచ్చాయి. ఈ సందర్భంగా సోనియా ‘‘17 ఏళ్ల వైవాహిక బంధం నుంచి నాకు విముక్తి లభించింది’’ అని తెలిపింది. విడాకులు వచ్చిన సందర్భంగా సోనియా గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసింది. ఇక స్నేహితులతో కలిసి తన సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. ఆమె ధరించిన డ్రెస్‌ మీద.. ఫైనల్లీ డివోర్స్‌డ్‌ అనే ట్యాగ్‌ కూడా డిజైన్ చేయించింది. ‘‘నేను నా థీమ్‌ను రంగురంగుల, ప్రకాశవంతంగా, యునికార్న్‌లతో నిండి ఉండేలా ఎంచుకున్నాను. నా జీవితం ఇలానే ఉండాలని భావించాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి సంతోషం తిరిగి వచ్చింది. ఈ మాత్రం సెలబ్రెషన్స్‌కు, మ్యాజిక్‌కు నేను అర్హత కలిగి ఉన్నానని అనుకుంటున్నాను.’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ విడాకుల సంబరానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Divorce Photos

Divorce Photos

Also read:

Andhra Pradesh: ఆరు నెలలకే స్కూల్ హెడ్‌మాస్టర్ బదిలీ.. ఆ పిల్లల వేదన అంతా ఇంతా కాదు..

గణేష్ శోభాయాత్రలో విషాదం.. డాన్స్ చేస్తూ ఒకరు, విద్యుత్ ‌షాక్‌తో మరొకరు మృతి.. ఒకే ఊరిలో ఇద్దరు దుర్మరణం

పాలను పదే పదే మరిగిస్తున్నారా.? ఈ విషయం తెలిస్తే ఇకపై ఆ పని చేయరు.. వీడియో