Kolkata Traffic Police: మీరు సూపర్ సార్.. ట్రాఫిక్ పోలీసుపై నెటిజన్ల ప్రశంసల వెల్లువ.. వీడియో
సోషల్ మీడియా పుణ్యమాని రోజుకో రియల్ హీరో వెలుగులోకి వస్తున్నాడు. తాజాగా కోల్‌కత్తాకు చెందిన మంచి మనసున్న ఓ ట్రాఫిక్ పోలీసు.. రియల్ లైఫ్ హీరో అంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.
సోషల్ మీడియా పుణ్యమాని రోజుకో రియల్ హీరో వెలుగులోకి వస్తున్నాడు. తాజాగా కోల్‌కత్తాకు చెందిన మంచి మనసున్న ఓ ట్రాఫిక్ పోలీసు.. రియల్ లైఫ్ హీరో అంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకీ అందరూ మెచ్చుకునేలా ఆ ఖాకీ చేసిన మంచిపని ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. కోల్‌కత్తాలో కుండపోత వర్షం కురుస్తుండగా ఓ ట్రాఫిక్ పోలీసు గొడుగు పట్టుకుని నడిరోడ్డుపై నిల్చొని విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నాడు. అదే సమయంలో రెండు వీధి కుక్కలు భారీ వర్షంలో ఎక్కడ ఆశ్రయం పొందాలో తెలియక ఆ ట్రాఫిక్ పోలీస్ గొడుగు కిందకొచ్చి నిల్చొన్నాయి. ట్రాఫిక్ పోలీసు కూడా వాటిని తరిమికొట్టకుండా.. తన గొడుగు కింద వాటికి ఆశ్రయం కల్పించి మానవత్వాన్ని చాటుకున్నాడు. భారీ వర్షంలో ట్రాఫిక్ పోలీస్ గొడుగు కింద రెండు వీధికుక్కలు కూడా నిల్చొని ఉన్న ఫోటోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: దోమ కాటేస్తే అంతే సంగతులు.. డెంగ్యూ కొత్త మ్యూటెంట్..11 రాష్ట్రాల్లో కల్లోలం.. వీడియో
RRR: అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్.. ఆర్.ఆర్.ఆర్ టీషర్ట్‌లు వచ్చేసాయోచ్.. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

