AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గణేష్ శోభాయాత్రలో విషాదం.. డాన్స్ చేస్తూ ఒకరు, విద్యుత్ ‌షాక్‌తో మరొకరు మృతి.. ఒకే ఊరిలో ఇద్దరు దుర్మరణం

నిర్మల్‌ జిల్లాలోని సారంగాపూర్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కౌట్ల (బీ)లో విద్యుదాఘాతంతో ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు.

గణేష్ శోభాయాత్రలో విషాదం.. డాన్స్ చేస్తూ ఒకరు, విద్యుత్ ‌షాక్‌తో మరొకరు మృతి.. ఒకే ఊరిలో ఇద్దరు దుర్మరణం
Died
Balaraju Goud
|

Updated on: Sep 25, 2021 | 9:42 AM

Share

Tragedy in Ganesh Shobha Yatra: నిర్మల్‌ జిల్లాలోని సారంగాపూర్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కౌట్ల (బీ)లో విద్యుదాఘాతంతో ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్‌కు విద్యుత్ కలర్ లైట్లతో అలంకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుదాఘాతంతో నగేష్‌ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

మరోఘటనలో శోభాయాత్ర సందర్భంగా డ్యాన్స్‌ చేస్తూ శేఖర్‌ (30) అనే యువకుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఒకే ఊర్లో, ఏకకాలంలో ఇద్దరు యువకులు చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.

Read Also…  Double Murder: కర్నూలు జిల్లాలో జంట హత్యల కలకలం.. పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తున్న సంచలనాలు