AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Scam: కుమ్మక్కైన బ్యాంక్ మేనేజర్.. తాడేపల్లిగూడెం యూనియన్ బ్యాంకులో పెద్ద ఫసక్.!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనియన్ బ్యాంకులో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. తప్పుడు పత్రాలతో

Bank Scam: కుమ్మక్కైన బ్యాంక్ మేనేజర్.. తాడేపల్లిగూడెం యూనియన్ బ్యాంకులో పెద్ద ఫసక్.!
Money
Venkata Narayana
|

Updated on: Sep 25, 2021 | 9:26 AM

Share

Loan Scam: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనియన్ బ్యాంకులో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. తప్పుడు పత్రాలతో సుమారు 6 కోట్లలో రుణం కాజేశారు. చేపల చెరువు లీజు పేరిట తప్పుడు పత్రాలతో కోట్ల రూపాయలు రుణం పొందారు ఆరుగురు వ్యక్తులు. ఈ ఆరుగురితో అప్పటి బ్యాంక్ మేనేజర్ కుమ్మక్కైనట్టు బ్యాంక్ అధికారులు గుర్తించారు.

స్కాం విషయం నిగ్గుతేలడంతో బ్యాంకు ఉన్నతాధికారులు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో రుణం పొందిన ఆరుగురు పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారికి సహకరించిన అప్పటి బ్యాంకు మేనేజర్ పై శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు బ్యాంక్ అధికారులు.

బ్యాంక్ సిబ్బంది సైతం నకిలీ పత్రాలతో అక్రమ మార్గాల్లో రుణాలు కాజేస్తోన్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. నిన్న ఖమ్మం జిల్లా డీసీసీబీలో అక్రమంగా రుణం తీసుకున్న 14మందిపైనా, వారికి సహకరించిన బ్యాంక్‌ సిబ్బంది ఐదుగురిపై ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నగరంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ డీసీసీబీలో నకిలీ పత్రాలు సమర్పించి 14మంది రుణం తీసుకున్నారు.

వీరిలో నల్లమోతు రాణి, సాయికుమార్‌, రవి, పురం వెంకటేశ్వర్లు, మాధవరావు, శ్రీధర్‌, మహబూబ్‌ ఖాన్‌, బానోత్‌ రవికుమార్‌, శశికుమార్‌, జనార్ధనాచారి, వీరనారాయణ, శేషు, బ్రహ్మం, నాగరాజుపై కేసులు నమోదు చేశారు. వీరితో పాటు బ్యాంక్‌ సిబ్బంది గూడ నాగచెన్నారావు, మేనేజర్‌ రమ్యశ్రీ, ఆనందరావు, సూపర్‌వైజర్‌ నర్సింహరావుపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Road Accident: కృష్ణాజిల్లా పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి