AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫ్యామిలీ ఎమర్జెన్సీ సాకుతో ఆఫీస్‌కు డుమ్మా.. కట్ చేస్తే.. ఐపీఎల్ మ్యాచ్‌లో ఆమెను చూడగా.!

తనకొక ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉందని.. అర్జెంట్‌గా సెలవు కావాలంటూ బాస్‌ను అడిగిన ఓ యువతి.. చివరికి అడ్డంగా దొరికిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమె సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టగా.. అది చూసి గొల్లుమని నవ్వేశారు. ఇంతకీ అదేంటో చూసేద్దామా..

Viral: ఫ్యామిలీ ఎమర్జెన్సీ సాకుతో ఆఫీస్‌కు డుమ్మా.. కట్ చేస్తే.. ఐపీఎల్ మ్యాచ్‌లో ఆమెను చూడగా.!
Rcb
Ravi Kiran
|

Updated on: Apr 11, 2024 | 5:25 PM

Share

తనకొక ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉందని.. అర్జెంట్‌గా సెలవు కావాలంటూ బాస్‌ను అడిగిన ఓ యువతి.. చివరికి అడ్డంగా దొరికిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమె సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టగా.. అది చూసి గొల్లుమని నవ్వేశారు. ఇంతకీ అదేంటో చూసేద్దామా..

ప్రస్తుతం దేశమంతా ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతోంది. క్రికెట్ ప్రేమికులందరూ మ్యాచ్ వచ్చిందంటే చాలు.. టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇంకొందరైతే తమ ఫేవరెట్ టీంను ఎంకరేజ్ చేసేందుకు స్టేడియాలకు కూడా వెళ్తున్నారు. సరిగ్గా ఇలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్ అయిన ఓ యువతి.. స్టేడియంలో తన ఫేవరెట్ టీం ఆడే మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లింది. అందుకోసం ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ బాస్‌ను సెలవు ఇమ్మని అడిగింది. స్టేడియంకు చేరుకొని మ్యాచ్‌ను ఆసాంతం ఎంజాయ్ చేసింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.

స్టేడియంలోని ఓ కెమెరా ఆమెపై ఫోకస్ పెట్టింది. ఆమె కనిపించింది టీవీలో కొన్ని క్షణాలే అయినా.. బాస్ యువతి విజువల్స్ చూడగానే.. ఆమెను గుర్తుపట్టేశాడు. దీంతో సదరు యువతి లీవ్ ఎందుకు తీసుకుందో ఇట్టే అర్ధం చేసుకున్నాడు బాస్. ఇలా చూశాడో.. లేదో.. అలా ఆ యువతి మొబైల్‌కి మెసేజ్‌లతో హోరెత్తించాడు. ‘నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ ఆ’ అంటూ మెసేజ్ బాస్ నుంచి రావడాన్ని చూసి సదరు యువతి షాక్ అయ్యింది. నిన్న 16.3 ఓవర్లో నువ్వు టీవీలో కనిపించావు. సో సెలవు పెట్టింది ఇందుకేనా.. అంటూ ఓ స్మైలీ ఎమోజీ పెట్టాడు. బాస్‌కి తన గురించి తెలిసి కూడా.. ఈ విషయాన్ని లైట్ తీసుకోవడాన్ని అర్ధం చేసుకుని.. ఊపిరి పీల్చుకుంది యువతి. ఇక ఈ ఉదంతాన్ని ఇంటర్నెట్‌లో నెటిజన్లతో పంచుకుంది సదరు యువతి. దీంతో ఆమె పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తించారు.

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"ఇరాన్ మాట తప్పితే.. మళ్లీ బాంబులే!" - ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?