Whiskey Noodles Recipe: రేయ్.. ఎవర్రా మీరంతా.. విస్కీతో నూడుల్స్ చేయడం ఏంటిరా.. షేక్ చేస్తున్నవీడియో..
Viral Video: పాక శాస్త్రంలో ఎవరి స్టైల్ వారిది.. ఒక్కొక్కరు ఒక్కోలా వంటలను చేస్తుంటారు. కొందరు రుచిని పెంచేందుకు ప్రయత్నిస్తే.. మరి కొందరు తమ ప్రత్యేకతను చూపించుకునేందుకు ట్రై చేస్తారు. ఇలాటివారిని మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తుంటాం. తాజాగా ఓ యువకుడు చేసిన చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అదంటంటే..

నూడుల్స్.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అంతా ఎంతో ఇష్టంగా తినే ఇన్స్టెంట్ ఫుడ్. పట్టణ ప్రాంతాల నుంచి పల్లె గడపలకు కూడా ఇది పాకింది. ఇందులో చాలా రకాల కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. ఇది చాలా రుచికరమైన వంటకం. ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు, ఇంటి నుండి దూరంగా నివసించే వారికి ఇది చాలా మంచి వంటకం. ఇది కేవలం కొన్ని నిమిషాల్లో తయారు చేయబడుతుంది. వెంటనే ఆకలిని తీర్చుతుంది. ఇన్స్టెంట్ నూడుల్స్‌ను ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడతారు. ఎందుకంటే వాటి సమయం ఆదా అవుతుంది. వంట చేయడం కూడా చాలా ఈజీ. సంవత్సరాలుగా ప్రజలు నూడుల్స్ సిద్ధం చేయడానికి వివిధ సృజనాత్మక మార్గాలతో ముందుకు వస్తున్నారు. అయితే ఓ యువకుడి ఈ వింత ప్రయోగం నెట్టింట హాట్ హాట్‌గా మారిపోయింది. అవును, అతను ఇలా ఎందుకు చేశాడో మీరు ఊహించలేరు. ఎలా ట్రై చేశాడో ఓసారి చూద్దాం..
నీళ్లకు బదులు విస్కీని ఉపయోగించి నూడుల్స్‌ను తయారు చేస్తున్న ఓ వ్యక్తి వీడియో వైరల్‌గా మారడంతో సోషల్ మీడియా యూజర్లలో ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. యష్ ప్రయోగాల ద్వారా ఫేస్‌బుక్‌లో భాగస్వామ్యం చేసిన ఈ వీడియో 64 వేలకు పైగా వీక్షించబడింది. సోషల్ మీడియా వినియోగదారుల నుంచి చాలా ఫన్నీ కామెంట్లు కూడా వచ్చాయి. నూడుల్స్ ప్రియులు మాత్రం మండిపడుతున్నారు.. తాము ఎంతో ఇష్టంగా తినే నూడుల్స్‌లో ఆల్కహాల్‌ను కలపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది అనుచితమైన లేదా అనారోగ్యకరమైన ఎంపిక అని అడుగుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఆ వీడియో చూసిన జనాలు ఇలాంటి రియాక్షన్స్ ఇచ్చారు
వీడియో తీస్తుండగా.. సైన్స్ ప్రకారం ఆల్కహాల్‌ను నీటితో వేడి చేస్తే, ఆల్కహాల్ గాలిలోకి ఆవిరైపోతుందని, మిగిలిన నీటిని మ్యాగీ తయారీకి ఉపయోగించవచ్చని యష్ చెప్పాడు. ఈ ప్రయోగాలు చేస్తూనే తన వీడియోలో కూడా చూపించాడు. నూడుల్స్ చేసిన తర్వాత తిని చూసి అందులో ఆల్కహాల్ మిగిలి ఉందా లేదా అని చెప్పాడు.
ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఒక యూజర్ “రవి శాస్త్రికి ఇష్టమైన వంటకం” అని కామెంట్ చేశాడు. మరొకరు “ఈ నూడుల్స్ నా బెస్ట్ ఫ్రెండ్ కోసం” అని వ్యాఖ్యానించాడు. మరో యూజర్ ఇలా వ్యాఖ్యానించాడు.. “మీరు ఇప్పుడు నూడుల్స్ తయారు చేయాలనుకుంటే, మద్యం తీసుకురాండి, ఆపై నీటిలో కాకుండా నూడుల్స్‌తో తయారు చేయండి.
మరిన్ని ట్రెడింగ్ న్యూస్ కోసం
