వింత గ్రామం.. అక్కడి ఆచారాలు చూస్తే ఆశ్చర్యపోతారు.. చెప్పులు వేసుకోరు.. ఆస్పత్రులకు వెళ్లరు
భారత దేశం ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. ఇక్కడ రకరకాల ప్రజలు, రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు కలిగి ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి అనుసరిస్తారు. వారి సంస్కృతి సంప్రదాయాలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి ఓ వింత గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం
భారత దేశం ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. ఇక్కడ రకరకాల ప్రజలు, రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు కలిగి ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి అనుసరిస్తారు. వారి సంస్కృతి సంప్రదాయాలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి ఓ వింత గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఊరిలో విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. అక్కడ నివసించే ప్రజలు కాళ్లకు చెప్పులు, బూట్లు వేసుకోరు. స్థానికులకే కాదు..బయట నుంచి ఎవరైనా ఆ గ్రామానికి వెళ్లినా అదే రూల్ పాటించాలని కండీషన్ కూడా పెట్టుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా పాకాల మండలం నుండి పది కిలో మీటర్ల దూరంలో వేమనగారి ఇండ్లు అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఇరవై కుటుంబాలు నివసిస్తున్నాయి. కేవలం 80మంది జనాభా ఉన్న ఈ చిన్ని గ్రామంలో విచిత్రమైన ఆచారం కొనసాగుతోంది. అదేంటంటే ఇక్కడి వాళ్లు ఎవరూ కాళ్లకు చెప్పులు వేసుకోరు. వ్యవసాయమే వీరి జీవనాధారం. ఈ గ్రామ ప్రజలు వైద్యులను, వైద్యాన్ని నమ్మరు. భగవంతుడ్నే ఎక్కువగా నమ్ముతారు. తాము పూజించే దేవుడే అన్నీ చూసుకుంటాడని నమ్ముతారు, పూజిస్తారు. వీరు పాల్వెక్రి కమ్యూనిటీకి చెందినవారు. అంతేకాదు తమను తాము దొరవర్లుగా కూడా ప్రకటించుకుంటారు. వీరెప్పుడూ ఏ పుణ్యక్షేత్రానికీ వెళ్లరు. వారి గ్రామంలోనే ఉన్న చిన్న గుడిలో పూజలు చేస్తారు. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే గ్రామంలో ఉన్న వేపచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఆ ఆలయాన్ని సందర్శిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు వచ్చినా గేటు వేయని సిబ్బంది.. పెను ప్రమాదం తప్పిందిలా..
‘టైటానిక్’ హీరోతో భారత మోడల్ డేటింగ్
ఎగరడమే కాదు.. నాకు ఈత కూడా వచ్చంటున్న గుడ్లగూబ
హైవే పైకాళ్లు చాపి దర్జాగా కూర్చున్న వ్యక్తి.. చివరికి ??
నా 20 ఏళ్లలో.. ఇలాంటి డైరెక్టర్‌ని చూడలే..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

