రైలు వచ్చినా గేటు వేయని సిబ్బంది.. పెను ప్రమాదం తప్పిందిలా..
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 24 గంటలు కూడా గడవలేదు. ఆ ఘటనను చూసైనా అప్రమత్తంగా ఉండాల్సిన రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కదిరిలో రైల్వే గేటును వేయడం మరిచిపోయారు. కనీసం అక్కడ రైలు వస్తే గేటు వేసేందుకు, తీసేందుకు కనీసం సిబ్బంది కూడా లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 24 గంటలు కూడా గడవలేదు. ఆ ఘటనను చూసైనా అప్రమత్తంగా ఉండాల్సిన రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కదిరిలో రైల్వే గేటును వేయడం మరిచిపోయారు. కనీసం అక్కడ రైలు వస్తే గేటు వేసేందుకు, తీసేందుకు కనీసం సిబ్బంది కూడా లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. స్థానికులు, రైలు లోకో పైలట్ అప్రమత్తం కావడంతో మరో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సత్యసాయి జిల్లా కదిరిలోని కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది గేటు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వాహనాలు యథేచ్ఛగా అటు ఇటు తిరిగాయి. ఈ లోపు రైలు రాకను గమనించి కొందరు స్థానికులు అప్రమత్తమై.. వాహనాలను నిలిపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కొందరు ట్రాక్ దాటుతుండటం, గేటు వేయకపోవడం గమనించి లోకో పైలట్ రైలును ఆపేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘టైటానిక్’ హీరోతో భారత మోడల్ డేటింగ్
ఎగరడమే కాదు.. నాకు ఈత కూడా వచ్చంటున్న గుడ్లగూబ
హైవే పైకాళ్లు చాపి దర్జాగా కూర్చున్న వ్యక్తి.. చివరికి ??
నా 20 ఏళ్లలో.. ఇలాంటి డైరెక్టర్‌ని చూడలే..
Chinna Jeeyar Swamy: ప్రభాస్‌లో ఆ రాముడు కనిపించాడు..
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

