ఇలా తయారయ్యారేంటి సామి.. ఆమ్లెట్ ఇలా కూడా చేస్తారా? యాక్..
ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కోకా-కోలా, స్కిటిల్స్‌తో చేసిన విచిత్రమైన ఆమ్లెట్ వైరల్‌గా మారింది. ఈ వింత ఆమ్లెట్‌ను ఒక విదేశీయుడు ధైర్యంగా తిన్నాడు. ఈ సంఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణ ఆమ్లెట్‌లకు భిన్నంగా ఇది చాలా విచిత్రంగా ఉంది.

ఆమ్లెట్లు చాలా రకాలుగా వేసుకోవచ్చు. కానీ, కొంతమంది చాలా వింత వింత ఆమ్లెట్లు వేసుకొని తింటారు. అలాంటి ఓ వింత ఆమ్లెట్ కథే ఇది. సాధారణంగా ఎవరైనా ఆమ్లెట్ వేసుకుంటే.. అందులో ఉప్పు, కారం, మసాలా, కొత్తిమీరతో పాటు వేరే ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటారు. కానీ, ఇక్కడ మాత్రం ఓ స్ట్రీడ్ ఫుడ్ మేకర్ ఏకంగా సాఫ్ట్ డ్రింక్ కోకా కోలా, చిన్న పిల్లలు తినే జెమ్స్ లాంటి స్వీట్ స్కిటిల్ వేసి ఆమ్లెట్ తయారు చేశాడు. పైగా దాన్ని ఓ ఫారెనర్ కోసం తయారు చేశాడు. పాపం.. ఆ ఫారెనర్ ఎంతో ధైర్యం చేసి దాన్ని తిన్నాడు.
అతనో ట్రావెట్ వీడియోలు తీసుకునే యూట్యూబర్‌లా ఉన్నాడు. ఆమ్లెట్ తయారు చేసే విధానం మొత్తం వీడియో తీసి.. తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఆ తయారీ విధానం చూస్తే.. యాక్ దీన్ని ఎలా తింటారు అని పించేలా ఉంది. పైగా ఆ ఫారెనర్ దాన్ని తింటూ ఇది తిన్న తరవాత నేను అనారోగ్యానికి గురి కావొచ్చేమో నాకు తెలియదు అంటూనే ఒక స్పూన్ తిన్నాడు. ప్రస్తుతం ఈ కోకా కోలా ఆమ్లెట్‌కు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
