కాబోయే అల్లుడికి షాకిచ్చిన అత్తగారు..ఈ పెళ్లి నాకొద్దు బాబోయ్‌ అంటూ వరుడు పరుగో పరుగు..

అత్త చేసిన హల్ చల్ చూసిన వరుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే అతడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. హఠాత్తుగా అతడు లేచి నిలబడి ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పాడు. ఊహించని పరిణామం అందరినీ షాక్‌కి గురి చేసింది. వరుడు తీసుకున్న నిర్ణయం పెళ్లి వేడుకలకు బ్రేక్ వేసింది.

కాబోయే అల్లుడికి షాకిచ్చిన అత్తగారు..ఈ పెళ్లి నాకొద్దు బాబోయ్‌ అంటూ వరుడు పరుగో పరుగు..
Bride Calls Off Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 01, 2023 | 4:12 PM

మన దేశంలో వివాహాలు కేవలం విలాసవంతమైనవి కాదు. ఆచారబద్ధమైనవి. ఇక్కడ వివాహాలు ఎంత ఆడంబరంగా జరుగుతాయో అంతే పవిత్రంగా జరుగుతాయి. పూర్వపు ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను విశ్వాసంతో పాటిస్తారు. ఆధునికత ఎన్నో అవకాశాలు కల్పించినా కొన్ని విషయాల్లో రాజీ పడేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. అలాంటి ఈ సంఘటన కూడా. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వరుడు పెళ్లి ఇంట్లో తనకు కాబోయే అత్తగారి అవతారం, ప్రవర్తనను చూసి పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో సరయాత్రిన్‌ చెందిన యువకుడికి, రాజ్‌పురాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. జూన్‌ 27న సాయంత్రం వరుడు ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అయితే పెళ్లికి వచ్చిన అతిధులతో పాటు వరుడి వద్దకు చేరుకున్న కాబోయే అత్తగారి పరిస్థితి చూసి షాక్ అయ్యాడు.

మరికాసేపట్లో పెళ్లి ముహూర్తం దగ్గరపడుతుంది. వివాహవేదిక వద్దకు వరుడికి ఆహ్వానం పలికేందుకు ప్రత్యేకంగా డీజే కూడా ఏర్పాటు చేశారు. డీజే సంబరాలతో వధువు తరఫు వారు డ్యాన్స్‌లు వేశారు. చుట్టాలు, బంధువులతో పాటు వధువు తల్లి కూడా ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేసింది.ఈ సంబరాల మధ్య పెళ్లికూతురు తల్లి సిగరెట్ తాగుతూ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను చూసిన వరుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే అతడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. హఠాత్తుగా అతడు లేచి నిలబడి ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పాడు. ఊహించని పరిణామం అందరినీ షాక్‌కి గురి చేసింది. వరుడు తీసుకున్న నిర్ణయం పెళ్లి వేడుకలకు బ్రేక్ వేసింది.

ఈ సంఘటన రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. చివరికి పెళ్లి రద్దయింది. వరుడు తన కుటుంబంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ ఘటన అనంతరం కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన అంగీకారంతో ఇరు కుటుంబాలు చర్చించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..